ప్రస్తుతం చాలా పాశ్చాత్య దేశాలు, ఇండియాలో కూడా కొన్ని రకాల వృత్తుల్లో వారానికి ఐదు రోజులు పని దినాలుండగా, వీటిని నాలుగుకు కుదించాలని కోరుతోంది యూకేకు చెందిన ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(టీయూసీ). యూకేలోని వివిధ ట్రేడ్ యూనియన్ల ఫెడరేషన్‌గా ఉన్న టీయూసీ ఈ డిమాండ్‌ను తెర మీదకు
నేటి యుగంలో ఉద్యోగులు ఎదుర్కొంటున్న ఒత్తిడి, కంపెనీలకు అవసరమైన ప్రొడక్టివిటీ.. రెండింటినీ పరిగణనలోకి తీసుకునే ఈ డిమాండ్ చేస్తున్నట్టుగా టీయూసీ జనరల్ సెక్రటరీ ప్రాన్సిస్ ఓ గ్రేడీ చెప్పారు. ప్రస్తుతం చాలా మంది వారానికి ఐదు రోజుల పాటు పని చేస్తున్నారని, దీన్ని నాలుగు రోజులకు తగ్గించాలని ఆమె పేర్కొన్నారు. దీని వల్ల ఉద్యోగులు మరింత రిలాక్స్ అయ్యే అవకాశం ఉందని, కుటుంబ సభ్యులతో గడిపే అవకాశం ఉంటుందని.. దాని వల్ల పని రోజుల్లో ఎక్కువ ప్రొడక్టివిటీ సాధ్యం అవుతుందని ఆమె అభిప్రాయపడ్డారు. ఉద్యోగులు వారి వారి కుటుంబీకులతో ఎక్కువ సమయం గడిపేందుకు కంపెనీలు అనుమతిని ఇవ్వాలని అన్నారు. దీని వల్ల కంపెనీలకే ప్రయోజనం కలుగుతుందని ఆమె పేర్కొన్నారు.