జగన్‌కు అనుకూల వాతావరణం. ఏపీలో జనం కూడా ఈ సారి.. సర్కారు మారాలనే యోచనలో ఉన్నారు. బాబుతో పోల్సితే.. జగన్ సీఎంగా ఉత్తమం అంటూ ఓటర్లు భావిస్తున్నారు. ఇదీ ఇటీవల 10 వేలమందిని సర్వే చేసినపుడు వ్యక్తమైన అభిప్రాయమంటూ వైసీపీ శిబిరం హడావుడి చేస్తుంది. మరోవైపు తెలంగాణలోనూ టీఆర్ఎస్‌కే ఈసారి మరో అవకాశం.. కేసీఆర్ మళ్లీ సీఎం అంటూ హోరెత్తిస్తున్నారు. ఇది రాజకీయంగా వేడెక్కించే అంశం. పైగా టీడీపీ ను ఇరుకు పెట్టేది కూడా. అందుకే.. ఈ దఫా.. ఏపీలో జగన్ గట్టిగానే పట్టుబట్టాడు. ముఖ్యంగా కీలకమైన నియోజకవర్గాల్లో టీడీపీపై లక్ష్యం నిర్దేశించుకుంది. ఒక రకంగా.. ఇక్కడ జగన్‌తోపాటు.. వైసీపీ శ్రేణులు కూడా దృష్టిపెట్టాయి. ఇక్కడ గెలుపు సాధించటం ద్వారా రాష్ట్రంలో ప్రత్యర్థిని బలహీనపరచటం తేలికనే భావనలో ఉన్నారు. ఆ జాబితాలో మొదటి నాయకుడు దేవినేని ఉమామహేశ్వరరావు మైలవరం నుంచి గెలిచిన ఆయన.. ఇప్పుడు టీడీపీలో కీలకమైన నేత. పైగా సర్కారు ప్రతిష్ఠాత్మకమైన ప్రాజెక్టుల సారధి. బీసీల నేతగా నెత్తిన పెట్టుకునే అచ్చెన్నాయుడు, మరోమంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు, గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు. అందుకే వ్యూహాత్మకంగా వైసీపీ పావులు కదుపుతుంది. మైలవరం నుంచి దేవినేనిపై ప్రతీకారం తీర్చుకోవాలని ఆశిస్తున్న వసంత కుటుంబానికి పట్టం కట్టబెట్టింది. వైసీపీ సమన్వయకర్తగా ఉన్న జోగి రమేష్‌ను అక్కడ నుంచి మరోవైపు సాగనంపారు. ఇటీవల వసంత నాగేశ్వరరావు స్వయంగా రంగంలోకి దిగి.. లోకల్ అధికారులను బెదిరించేంత వరకూ చేరారు. దేవినేనిపై ప్రతీకారం తీర్చుకునేందుకు కడప నుంచి మనుషులు వస్తారంటూ హెచ్చరించారు. యరపతినేని పరిస్థితి కూడా ఇలాగే ఉన్నట్టుంది. అక్కడ నుంచి కాసు మహేష్‌రెడ్డిని రంగంలోకి దింపి నెగ్గాలనే తపన పడుతుంది.
ఇటీవల మైనింగ్ కుంభకోణంపై నానాయాగీ చేసింది. వాస్తవానికి యరపతినేని పై ప్రజల్లోనూ కొంత వ్యతిరేకత నెలకొంది. పార్టీ అధికారంలోకి రావటంతో తప్పటడుగులు వేశారనే భావన కూడా పెరిగింది. అచ్చెన్నాయుడు.. బీసీ మంత్రిగా.. ఎర్రన్నాయుడు సోదరుడిగా కులపరమైన బలం ఉన్నా.. ఈ దఫా తాను కూడా ఆరోపణలు, అవినీతిలో కూరుకుపోవటం టీడీపీను ఇబ్బందిపెట్టే అంశం. మరో నేత అయ్యన్నపాత్రుడు కూడా ఘంటాపై కక్షసాధింపుతో.. వ్యవహరించాడు. ఇటీవల తన నియోజకవర్గ అభివృద్ధికి నిధులు ఇవ్వట్టేదంటూ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేలా ఆరోపణలు చేశాడు. వైసీపీ ఏమని భావిస్తుందో.. అదే విధంగా ఆ నాలుగు నియోజకవర్గాల్లోనూ నెలకొంది. పైగా జనసేన ప్రభావం కూడా.. టీడీపీ ఓట్లపైనే చూపుతుందనేది జగన్ శిబిరం భావిస్తుంది. ఇన్ని అనుకూలతలు.. వ్యూహాలతో వైసీపీ అనుకున్నట్టుగా నెగ్గుతుందా! లేదా! అనేది కాలమే నిర్ణయించాలి.