జిల్లాలోని తాడిపత్రి మండలం చిన్నపొడమల లో సోమవారం కుడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. రెండ్రోజుల క్రితం గ్రామస్తులకు, ప్రబోధానందస్వామి వర్గీయులకు మధ్య ఘర్షణ జరిగిన సంగతి తెలిసిందే. ఈ న గొడవల్లో ఇప్పటివరకూ ఓ సీఐ సహా 45 మంది తీవ్రంగా గాయపడ్డారు. కొందరు దుండగులు ఇద్దరు వ్యక్తుల గొంతును కోయగా, ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో తాడిపత్రి పోలీస్ స్టేషన్ ముందు గ్రామస్తులకు మద్దతుగా ఆదివారం రాత్రి ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి రాత్రంతా అక్కడే గడిపారు. గ్రామస్తులపై దాడికి పాల్పడిన నిందితులను అరెస్ట్ చేయాలని అయన డిమాండ్ చేసారు. గ్రామస్తులకు న్యాయం జరిగే వరకూ తాను పోలీస్ స్టేషన్ ముందు నుంచి కదలబోనని వెల్లడించారు. . వినాయక నిమజ్జనం సందర్భంగా ఆశ్రమం మీదుగా వెళ్లరాదని ప్రబోధానంద స్వామి వర్గీయులు హెచ్చరించడంతో చిన్నపొడమల, పెద్ద పొడమల గ్రామస్తులు తిరగబడ్డారు. గ్రామస్తులకు జేసీ దివాకర్ రెడ్డి మద్దతుగా నిలవడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్డంగా పెద్ద ఎత్తున వాహనాలు ధ్వంసం అయ్యాయి. కాకా ప్రతి పౌర్ణమి, అమావాస్య రోజున పూజల పేరుతో ఇక్కడ అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని జేసీ ఆరోపించారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించాలని ఎంపి జెసి దివాకర్ రెడ్డి పట్టుబట్టి ధర్నా చేస్తున్నారు. ఆశ్రమ నిర్వాహకులపై చర్యలు తీసుకునేంత వరకు ధర్నా విరమించబోనని జేసీ దివాకర్రెడ్డి స్పష్టం చేశారు. ఆశ్రమాన్ని ఖాళీ చేయించడానికి ఆక్టోపస్ సిబ్బంది ని ప్రభుత్వం రంగంలోకి దింపింది. ఘటనలో తీవ్రంగా గాయపడ్డ పెద్దిరెడ్డిని హైదరాబాద్ కు తరలించారు. సోమవారం ఉదయం సీఎం చంద్రబాబు నాయుడు జేసీతో మాట్లాడినట్లు సమాచారం.