YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

మాల్యాపై సీబీఐ చార్జీ షీట్

మాల్యాపై సీబీఐ చార్జీ షీట్
బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టిన లిక్కర్ కింగ్‌ విజయ్ మాల్యాపై తొలి ఛార్జ్‌షీట్ దాఖలు చేసేందుకు సీబీఐ సన్నాహాలు మొదలుపెట్టింది. ఎస్‌బీఐ నేతృత్వంలోని 17 బ్యాంకుల కన్సార్షియంను విజయ్ మాల్యా రూ.6000 కోట్ల మేర ఎగనామం పెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసుకు సంబంధించి మాల్యాకు సహకరించినట్లుగా చెబుతున్న కొంతమంది బ్యాంకు ఉన్నతాధికారులు పేర్లను సీబీఐ తన ఛార్జ్‌షీట్‌లో చేర్చనుంది. నెలరోజుల్లో ఛార్జ్‌షీట్ దాఖలు చేయాలని సీబీఐ భావిస్తోంది. 17 బ్యాంకుల కన్సార్షియంను ముంచేసిన కేసులో విజయ్ మాల్యాపై ఇదే తొలి ఛార్జ్‌షీట్ కానుంది. అంతకుముందు ఐడీబీఐ బ్యాంకుకు రూ.900 బకాయిపడ్డ కేసులో ఓ ఛార్జ్‌షీట్ దాఖలైంది. ఈ వ్యవహారంలో కూడా బ్యాంకు ఉన్నతాధికురాల ప్రమేయం ఉందన్న ఆరోపణలున్నాయి. ఐడీబీఐ రుణాలకు సంబంధించి 2015లో ఓ కేసు, కన్సార్షియం రుణాలకు సంబంధించి 2016లో మరో కేసు నమోదయ్యాయి. అయితే ప్రస్తుతం పదవిలో ఉన్నవారితో పాటు పదవీ విరమణ పొందిన ఉన్నతాధికారుల పేర్లు ఛార్జ్‌షీట్‌లో ఉండొచ్చని భావిస్తున్నారు. కింగ్‌‍ఫిషర్ అధినేత విజయ్‌ మాల్యాతో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ ఏ.రఘునాథన్, మరికొందరు మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లు నిందితులుగా ఉన్నారు. ఆర్థికశాఖ ఉన్నతాధికారుల ప్రమేయంపైనా సీబీఐ ఆరా తీస్తోంది. 

Related Posts