YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

మార్కెట్స్ లో బ్లాక్ మండే

 మార్కెట్స్ లో బ్లాక్ మండే
స్టాక్ మార్కెట్లకు సోమవారం మరోసారి బ్లాక్ మండేగా నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల ప్రభావంతో సెన్సెక్స్ భారీగా నష్టపోయింది. బ్యాంకింగ్, కన్జూమర్ డ్యూరబుల్స్, ఆయిల్, గ్యాస్, పీఎస్‌యూల షేర్లు నష్టపోయాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 505.13 పాయింట్లు నష్టపోయి 37585.51 పాయింట్ల దగ్గర ముగిసింది. ఇవాళ ఒక్కరోజే 1.33 శాతం మేర సెన్సెక్స్ పడిపోవడం గమనార్హం. అటు నిఫ్టీ 137.45 పాయింట్లు నష్టపోయి 11377.75 పాయింట్ల దగ్గర ముగిసింది. చైనా ఉత్పత్తులపై మరోసారి అమెరికా టారిఫ్స్ విధించబోతున్నదన్న వార్తలు అంతర్జాతీయ మార్కెట్ల సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. ఆ ప్రభావం భారత మార్కెట్లపై కూడా స్పష్టంగా కనిపించింది. సెన్సెక్స్‌లో యెస్‌బ్యాంక్, హెచ్‌యూఎల్, యాక్సిస్ బ్యాంక్, ఎస్‌బీఐ, ఐటీసీ, హీరోమోటా కార్ప్, హెచ్‌డీఎఫ్‌సీ, ఏషియన్ పెయింట్, ఆర్‌ఐఎల్, టాటా మోటార్స్, సన్‌ఫార్మా షేర్లు తీవ్రంగా నష్టపోయాయి.

Related Posts