శ్రీలంక టోర్నీ గ్రూప్ దశలోనే నిష్క్రమించింది. ఐదుసార్లు చాంపియన్‌గా నిలిచిన శ్రీలంక జట్టుకు దారుణ పరాభవం.. తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్ చేతిలో కంగుతిన్న లంకేయులు ఈసారి పసికూన అఫ్ఘానిస్థాన్ చేతిలో 91 రన్స్ తేడాతో చావుదెబ్బ తిన్నారు. 250 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన లంక.. అఫ్గాన్ స్పిన్నర్ల ధాటికి 41.2 ఓవర్లలో 158 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు టాప్ ఆర్డర్ అద్భుతంగా ఆడడంతో అఫ్ఘాన్ 50 ఓవర్లలో 249 పరుగులకు ఆలౌటైంది. రహమత్ షా (90 బంతుల్లో 5 ఫోర్లతో 72) అర్ధ సెంచరీతో మెరవగా ఇహ్‌సానుల్లా జనత్ (65 బంతుల్లో 6 ఫోర్లతో 45) రాణించాడు. తిసారకు ఐదు, అకిలకు రెండు వికెట్లు దక్కాయి. రహమత్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ లభించింది.