ఉత్తరాంధ్ర మీదకు వాయుగుండం దూసుకొస్తుందని విశాఖపట్నం తుఫాన్ హెచ్చరిక కేంద్రం ప్రకటించింది. మంగళవారం నాడు మధ్య బంగాళాఖాతంలో ఉత్తర దిశగా అల్పపీడనం ఏర్పడనున్నదని తెలిపింది. ఆది 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం వుది. వాయుగుండం పశ్చిమ వాయవ్యంగా పయనిస్తూ ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిసా తీరాలకు చేరే ప్రమాదం వుందని హెచ్చరించింది. మూడు రోజులపాటు ఉత్తరాంధ్రకు భారీ వర్షాలు కురుస్తాయి. తెలంగాణ, రాయలసీమలకూ వర్షాలు. పిడుగులు కూడా పడతాయని హెచ్చరికలు జారీ చేసింది. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని సూచించింది. దాంతో అధికార యంత్రాంగం అప్రమత్తమయింది.