రామకృష్ణాపురం కృష్ణాజిల్లాలోని కోడూరు మండలం శివారు పంచాయతీ. దీనికి అనుబంధంగా ఇరాలి, ఊటగుండం, బసవ వానీ పాలెం, గ్రామాలు సముద్రానికి దగ్గరగా ఉన్నాయి. ఈ శివారు ప్రాంతం కు ఈస్ట్ ఛానల్ ద్వారా సాగునీరు అందుతుంది. ఈ కాలువ కు వ్యతిరేక దిశలో లెవెల్ ఎత్తుగా ఉండటం వలన ప్రతి సంవత్సరం ఈ గ్రామాలకు సాగునీరు అందడం గగనమైపోతోంది. కాలువ పూర్తిస్థాయిలో ప్రవహించిన కూడా కొద్దిపాటి నీరు కూడా ఈ చివర ప్రాంతాలకు అందడం లేదు. మిగిలిన ప్రాంతాలలో ఊడ్పులు అయి నెల దాటినా కూడా ఈ ప్రాంతం కు నీరు అందక పోవడం వలన నారుమళ్ళు రెండుసార్లు ఎండిపోయాయి. ఇంకా కొన్ని పొలాల్లో నాట్లు మొదలుపెట్టాల్సి ఉంది. క్రితం సంవత్సరం కూడా సరైన సమయంలో సాగునీరు అందక ధాన్యం ఉత్పత్తి 30 బస్తాల రావాల్సిన చోట 15 నుండి 20 బస్తాలు మాత్రమే వచ్చింది.
క్రిందటి సంవత్సరం దిగువున లెవెల్ ఎక్కువగా ఉండటం వలన పైగా కాలువను రివిటింగ్ చేయటం వలన ఈ ప్రాంతం కు నీరు రాకపోవడంతో రైతులు ప్రాక్లైమర్ ను వాడి లెవెల్ చేయటానికి ప్రయత్నం చేశారు
అప్పుడు ఇరిగేషన్ అధికారులు తగు చర్యలు తీసుకుంటామని చెప్పడంతో రైతులు ఆందోళన చేయడం ఆపారు. కానీ ఈ సంవత్సరం కూడా అదే సమస్య వలన సెప్టెంబర్ మధ్య వరకు కూడా సాగునీరు అందక నారు మళ్లు ఎండిపోవడమే కాకుండా, పొలం పనులు ఆలస్యం అవటం దిగుబడి రాక పోవడం వలన క్రితం సంవత్సరం మల్లే ఇప్పుడు కూడా దిగుబడి తగ్గ బోతుందని రైతులు చాలా ఆందోళనగా ఉన్నారు.
అది కాకుండా మురుగు కాలువలు ఈ పంట కాలువలను బసవ వానీ పాలెం, ఊట గుండం, ఇరాలీ గ్రామ సరిహద్దుల్లో క్రాస్ అవుతున్నాయి. ఇరాలి లో పంట కాలువ మురుగు కాలువ కింద తూములు ద్వారా ప్రవహిస్తోంది. బసవ వారి పాలెం లో పంట కాలువ మరియు రోడ్డు కింద తూము ద్వారా మురుగుకాలువ వహిస్తోంది. ఊటగుండంలో మురుగు కాలువ పైన పైప్లైన్ ద్వారా వంట కాలువ ప్రవహిస్తోంది
ఈ మూడు క్రాసింగ్ ప్రదేశాలలో, తూములు/ పైపులైను చిల్లులు పడటం వలన,
సముద్రపు బ్యాక్ వాటర్ తో నిండిన మురుగునీరు, పంట కాలవ లో ఉన్నటువంటి మంచినీటిని ఉప్పునీటి గా మార్చటం ఆ నీరు సాగునీరు గా వెళ్లి పంటభూముల లో ఉప్పు సాంద్రత పెంచటం వలన పంటలు బాగా దెబ్బతింటున్నాయి. అసలే పూర్తిగా సాగు నీరు రాక ఇబ్బంది పడుతున్న రైతులకు, ఇలా ఉప్పు నీటితో కలిసిన సాగునీరు రావడంతో చాలా ఇబ్బంది కలుగజేస్తోంది. నాలుగు వేల ఎకరాలు సాగు చేస్తున్న ఈ ప్రాంతపు రైతులకు వ్యవసాయం మాత్రమే ఆధారం. అదీ సాలుకు ఒక పంట మాత్రమే. కానీ పంట కాలువ లెవెల్స్ విషయంలో టెక్నికల్ గా చేసిన తప్పిదం వలన ప్రతి సంవత్సరం ఈ ప్రాంతంలోని రైతులు సాగునీటి గురించి ఎదురు చూడటం, వచ్చిన నీళ్లు మురుగు నీటి కాలువల ద్వారా కలుషితమైన ఉప్పు నీటి వలన పంటలు మరింత దెబ్బ తిని రైతు పరిస్థితి రోజు రోజుకి ఇబ్బందికరంగా తయారవుతోంది.
కావున రామకృష్ణాపురం పంట కాలువల గురించి ప్రత్యేక దృష్టితో అధికారులు అలోచించి కాలవలు లెవెల్ చేయడం, లీక్ లను మరమ్మత్తు చేయించి ఆదుకోవాల్సిందిగా ఈ ప్రాంత రైతులు ప్రార్థిస్తున్నారు.