YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

విమానం నుంచి దూకి మోదీకి విషెస్‌.. మహిళా స్కైడైవర్‌ విన్యాసం..!!

విమానం నుంచి దూకి మోదీకి విషెస్‌.. మహిళా స్కైడైవర్‌ విన్యాసం..!!

 విమానం నుంచి దూకి మోదీకి విషెస్‌ తెలిపిన మహిళా. వైరల్‌ అవుతున్న మహిళా స్కైడైవర్‌ విన్యాసం. సోమవారం భారత ప్రధాని నరేంద్ర మోదీ తన 68వ పుట్టినరోజును జరుపుకొన్నారు.  చికాగోలో నివసిస్తున్న భారతీయ స్కైడైవర్, పద్మశ్రీ అవార్డు గ్రహీత శీతల్‌ మహాజన్‌ మోదీకి వీరాభిమాని. ఈ సందర్భంగా ఆమె ఏకంగా విమానం నుంచి దూకి ఆయనకు శుభాకాంక్షలు చెప్పారు.  ‘గౌరవనీయ భారత ప్రధాని నరేంద్రమోదీకి 13వేల అడుగుల ఎత్తు నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు. నాతో పాటు ఉన్న నా సహ స్కైడైవర్‌ సుదీప్‌ కొడవాటి ఈ వీడియోను తీశారు. గత నాలుగేళ్ల నుంచి మోదీని కలవాలని ఎంతో ప్రయత్నిస్తున్నాను. కానీ ఆయన కార్యాలయం నుంచి నాకు ఎలాంటి స్పందన రావడంలేదు. అందుకే ఇలా విమానం నుంచి దూకి శుభాకాంక్షలు చెప్పాలనుకున్నాను. కనీసం ఈ వీడియో చూశైనా ఆయన నన్ను కలుస్తారని చిన్న ఆశ.’ అని పేర్కొన్నారు. 

Related Posts