YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిరుద్యోగులకు తీపి కబురు

 నిరుద్యోగులకు తీపి కబురు
ఏపీ లో నిరుద్యోగులకు  ప్రభుత్వం తీపికబురు అందించింది.. ఇరవై వేల  ఉద్యోగాల భర్తీ కి ముఖ్యమంత్రి  చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. గ్రూప్ 1,2,3పాటు, పోలీస్, టీచర్లు పోస్టుల భర్తీ కానున్నాయి.. గ్రూప్ 1 లో 150, గ్రూప్ 250, గ్రూప్ 3 లో 1670 ఖాళీలు వున్నాయి. ఇదికాక, డిఎస్సి లో ఉన్న  9,275 పోస్టులున్నాయి.  ప్రకటించిన ఖాళీలు అన్ని కూడా  భర్తీ  చేయాలన్నారు ముఖ్యమంత్రి. గ్రూపు 1,2 లతో పాటు పోలీసు, ఉపాధ్యాయుల  ఖాళీల భర్తీపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది.  జిల్లా పరిషత్, మండల ప్రాథమిక పాఠశాల, మున్సిపల్   పాఠశాలు, గురుకుల పాఠశాలలు, సాంఘీక సంక్షేమ రెసిడెన్షియల్ పాఠశాలలలో ఉపాధ్యాయులు ఖాళీలు భర్తీ చేయాలని కుడా ప్రభుత్వం నిర్ణయించింది. పాలిటెక్నిక్ లెక్చరర్ పోస్టులు 310, జూనియర్ లెక్చరర్ పోస్టులు 200, డిగ్రీ కళాశాల లెక్చరర్ పోస్టులు 200 భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సమాచారం పౌర సంబంధాల శాఖ లో 21 ఖాళీల భర్తీకి కుడా  ముఖ్యమంత్రి అనుమతి ఇచ్చారు. ఇందులో డిపిఆరో, ఏపీఆరో,  డిఈటి ఈ పోస్టులు ఉన్నాయి .వైద్య ఆరోగ్య శాఖ లో 1604 పోస్టులు, ఇతర ఖాళీలు 1636 భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.. ఈ త్వరలోనే పోస్టులు సంబంధించిన భర్తీ ని పూర్తి చేయాలని అధికారులను ముఖ్యమంత్రి అదేశించించారు. కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ఆశించిన స్తాయి లేదని నిరుద్యోగ యువత అసహనం, అసంతృప్తి వ్యక్తం ,ఏస్తోంది. ఇప్పుడు  ముఖ్యమంత్రి ఇరవై వేల ఉద్యోగాల భర్తీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో   నిరుద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. 

Related Posts