YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

ఆకట్టుకొనే స్లొగన్స్ తో వినూత్న ప్రచారం

ఆకట్టుకొనే స్లొగన్స్ తో వినూత్న ప్రచారం

 ఏపీలోనూ ఎన్నికల సందడి మొదలైపోయింది. టీడీపీ, వైసీపీ పోటా పోటీగా ప్రచారంలోకి దిగబోతున్నాయి. అందుకు తగ్గట్టుగా వ్యూహాలు, కసరత్తులు చేస్తున్నాయి. అయితే మామూలుగా ప్రచారం చేస్తే ఏం పస ఉంటుందని అనుకున్నారో ఏమో డిఫరెంట్ గా స్లోగన్స్ తో ప్రచారానికి సిద్ధమవుతున్నారు జగన్. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇలాంటి స్లోగన్స్ తోనే ప్రచారంలోకి వెళ్లగా.. అవి బాగా పాపులర్ అయ్యారు. ఇప్పుడు జగన్ కూడా అదే ఫాలో అవుతున్నారు. క్యాచీగా ఉండే స్లోగన్స్ తో కాంపైన్ చేసేందుకు కేడర్ ను సిద్ధం చేస్తున్నారు. బయట ప్రచారంతో పాటు సోషల్ మీడియాలోనూ ఈ స్లోగన్స్ తో ముందుకెళ్లేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకీ వైసీపీ ప్రచార వ్యూహాలేంటి..? జగన్ స్లోగన్స్ ఏంటి..? :ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో వైసీపీ దూకుడు పెంచింది . ప్రజలకు మరింత చెరువయ్యేందుకు.. పార్టీని బలోపేతం చేసేందుకు సరికొత్త కార్యక్రమాలను చేపడుతోంది. 2019 ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు ఆపార్టీ అధినేత జగన్. అందుకోసం ప్రచారాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. మామూలుగా కాకుండా డిఫరెంట్ వేలో ప్రచారానికి శ్రీకారం చుట్టారు. అదే స్లోగన్ క్యాంపైన్. కొత్త నినాదాలను జనంలోకి తీసుకెళ్లడం ద్వారా ప్రచారానికి మరింత ఊపు వస్తుందనేది వైసీపీ వ్యూహం. అందులో భాగంగానే పలు నినాదాలతో ప్రచారం మొదలుపెట్టేసింది. ప్రస్తుతం ఓ కొత్త నినాదాన్ని వైసీపీ రెడీ చేసింది. అదే ..రావాలి జగన్ - కావాలి జగన్. ఇదే పేరుతో ప్రజల్లోకి వెళుతోంది వైసీపీ. మొన్నటి వరకు అన్నరావాలి పేరుతో వైసీపీ ప్రచారం చేసింది. ఇప్పుడు స్లోగన్ మార్చింది.నవరత్నాల పేరుతో ముందుకు వెళ్తున్న వైసీపీ.. ఇప్పుడు రావాలి జగన్ -కావాలి జగన్ నినాదంతో ప్రచారం మొదలు పెట్టింది. రాష్ట్రవ్యాప్తంగా ఈకార్యక్రమాన్ని విస్తృతంగా ముందుకు తీసుకెళ్లాలని ఇప్పటికే జగన్ కేడర్ కు దిశానిర్దేశం చేసేశారు. బూత్ స్థాయి కార్యకర్త నుంచి నియోజకవర్గ సమన్వయకర్త వరకు 'రావాలి జగన్‌.. కావాలి జగన్‌' నినాదంతో ముందుకు సాగుతున్నారు. పార్టీ సమన్వయకర్తలు, నేతలు, కార్యకర్తలు ప్రజలతో మమేకం అవుతున్నారు. ప్రతి రోజూ కనీసం రెండు పోలింగ్‌ బూత్‌ల పరిధిలోని ఇళ్లకు వెళ్లి..  వైసీపీ లక్ష్యాలను వివరిస్తూ.. నవరత్నాల వల్ల కలిగే ప్రయోజనాలను వివరిస్తారు. నెల రోజుల్లో 50 పోలింగ్‌ బూత్‌ల పరిధిలో గల కుటుంబాల్లోని వ్యక్తులందర్నీ కలుస్తారు. కార్యక్రమంలో భాగంగా.. ఎక్కడైనా ఇంకా బూత్‌ కమిటీల నియామకాలకు జరగకపోతే వాటిని వారం రోజుల్లో పూర్తి చేయాలని ఇప్పటికే వైసీపీ అధ్యక్షుడు జగన్ సూచించారు. నియామకాలు జరగకపోతే.. పార్టీ కేంద్ర కమిటీయే సమర్థులను గుర్తించి నియామకాలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ కార్యక్రమం కేవలం 168 నియోజకవర్గాలకే జగన్ పరిమితం చేశారు. మిగిలిన నియోజకవర్గాల్లో జగన్‌ పాదయాత్ర జరుగుతున్నందున దానికి మినహాయింపు నిచ్చారు. చంద్రబాబును గద్దె దించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు జగన్. అందుకు ప్రభుత్వ వ్యతిరేక విధానాలను ఎండగట్టి.. వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచాలన్నది జగన్ ప్లాన్. ఇప్పుడు  నినాదం పేరుతో దాన్ని అమలు చేస్తోంది. ప్రజల్లోకి మరింత చొరవగా వెళ్లేందుకు ఈ నినాదం ఉపయోగపడుతుందని జగన్ భావిస్తున్నారు. ఈ నినాదంతో గడపగడపకూ వెళ్లి పార్టీ రూపొందించిన నవరత్నాలను వివరించడంతో పాటుగా ప్రభుత్వ వైఫల్యాలను, టీడీపీ నేతల అవినీతిని ఎండగట్టాలని పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. వచ్చేనాలుగైదు నెలలకు కీలకమైనందున.. ప్రతీ ఒక్కరి దగ్గరకు వెళ్లి, వైసీపీ గెలిస్తే ప్రజల కష్టాలు తీరుతాయని హామీలు ఇవ్వాలని జగన్ పార్టీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లుతెలుస్తోంది. టీడీపీ నాలుగేళ్ల పాలనలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని .. వైసీపీ అధికారంలోకి వస్తే ఆ సమస్యలను పరిష్కరిస్తుందని ప్రజలకు వివరించనున్నారు. స్లోగన్స్ తో ప్రచారం ఇప్పుడు కొత్తేమీ కాదు. గత ఎన్నికల్లో చంద్రబాబు ఇలాంటి స్లోగన్స్ తోనే ప్రజల్లోకి వెళ్లారు. బ్రింగ్ బాబూ బ్యాక్ , జాబు కావాలంటే - బాబు రావాలి అనే స్లోగన్స్ తో చంద్రబాబు ప్రచారం చేశారు. ఈ నినాదాలు గత ఎన్నికల సమయంలో బాగా పాపులర్ అయ్యాయి. యువతను ఎక్కువ ఆకర్షించగలిగారు చంద్రబాబు. ఈ నినాదం కాన్సెప్ట్ బాగా వర్కవుట్ అయింది. ఇప్పుడు మళ్లీ మీరే రావాలి అంటూ మరో స్లోగన్ తో ఈ ఎన్నికల్లో ప్రచారం చేయబోతున్నారు. ఇప్పుడు జగన్ కూడా చంద్రబాబునే ఫాలో అవుతున్నారు. మరి స్లోగన్స్ తో చేసే ఈ కొత్తరకం ప్రచారాలు వైసీపీకి ఎలా ప్లస్ అవుతాయో చూడాలంటే కొన్నిరోజులు ఆగాల్సిందే. 

Related Posts