చిత్తూరు:
బుధవారం తెల్లవారుజామున ఐరాల మండలం ఐకె రెడ్డి పల్లిలో రెండు గంటల ముప్పై నిమిషాలకు స్వల్పంగా భూమి కంపించింది. ,భూమిలో నుంచి భారీ శబ్దాలు రావడంతో ఇళ్లల్లో నిద్రపోతున్న గ్రామస్తులు భయంతో బయటకు పరుగులు తీశారు. భూకంపం ధాటికి గ్రామంలో ఇండ్ల గోడలు నెర్రులు బారాయి. ఇంట్లో వస్తువులు కిందపడపోయాయి. సుమారు ఐదు సంవత్సరాల క్రితం కుడా ఇలాగే భూమి కంపించింది. మళ్ళీ ఇప్పుడు భూమి కంపించిందని గ్రామస్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాత్రి ఒక పక్క వర్షం, మరో పక్క భూకంప భయంతో స్థానికులు నిద్రపోకుండా వుండిపోయారు. మరోసారి భూకంప మోస్తుందని బిక్కు బిక్కుమంటున్నారు.