టెలికం రంగంలో రిలయన్స్ జియో మరోమారు సత్తా చాటింది. ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్లు మొత్తంగా 9.27 లక్షల మందిని మాత్రమే కొత్త వినియోగదారులను చేర్చుకోగా, జియో దీనికి 13 రెట్లు అధికంగా చేర్చుకుంది. జూలై నెలలో దాదాపు 1.18 కోట్ల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. అలాగే, జియో మొత్తం ఖాతాదారుల సంఖ్య 22.7 కోట్లకు చేరుకుంది. టెలికం నియంత్రణ సంస్థ ట్రాయ్ ఈ వివరాలను విడుదల చేసింది.