బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నిజాయితీగా పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి కి ప్రశ్నలు వేస్తున్నారు, వాటిలో నిజం లేదని ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విమర్శించారు. బుధవారం నాడు మీడియతో మాట్లాడారు. మేం కన్నాకు 10 ప్రశ్నలు వేస్తున్నాం. కన్నాను మించిన భూభాకాసురుడు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు. ముగ్గురు ముఖ్యమంత్రుల వద్ద పనిచేసి వందల ఎకరాల భూమిని కాజేయలేదాని నిలదీసారు. పదేళ్ళలో జరిగిన ఐదు లక్షల ఎకరాల భూ కబ్జాలలో కన్నా పాత్ర ఎంత? కన్నా కుమారుడు డైరెక్టర్ గా ఉన్న కంపెనీ భాగోతం పై చర్చిద్దామా? ఒకప్పుడు సైకిల్ పై తిరిగిన కన్నా కు ఇప్పుడు పెద్ద పెద్ద భవంతులు, ఢిల్లీలో ఫ్లాట్స్ ఎలా కొన్నావని ప్రశ్నల వర్షం కురిపించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో మీకన్నా కళంకిత మంత్రి ఎవరైనా ఉన్నారా? రోజు అసత్య ప్రచారాలతో మోడీ, అమిత్ షా రాసిచ్చిన స్క్రిప్ట్ చదువుతూ ముఖ్యమంత్రి గారి పై లేనిపోని ఆరోపణలు తో బురద జల్లుతున్నారని మండిపడ్డారు.