క్రికెట్ ప్రేమికులంతా ఆసక్తిగా ఎదురు చూసిన పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో భారత్ సమష్టి ఆటతీరుతో విరుచుకుపడింది. బుధవారం ఆసియాక్‌పలో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత జట్టు 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. తొలుత టీమిండియా బౌలర్లు దాయాదిని 162 పరుగులకే కుప్పకూల్చారు, బౌలర్లు కేదార్ జాదవ్ (3/23), భువనేశ్వర్ కుమార్ (3/15), జస్ర్పీత్ బుమ్రా (2/23) పాక్ నడ్డి విరిచారు.. ఆ తర్వాత ఓపెనర్లు రోహిత్ శర్మ (52; 39 బంతుల్లో 6×4, 3×6), శిఖర్ ధావన్ (46; 54 బంతుల్లో 6×4, 1×6) చెలరేగి శుభారంభం అందించారు. అంబటి రాయుడు (31; 46 బంతుల్లో 3×4), దినేశ్ కార్తీక్ (31; 37 బంతుల్లో 2×4, 1×6) అజేయంగా నిలిచి గెలుపు లాంఛనం పూర్తిచేశారు. భారీ సిక్సర్లు, బౌండరీలతో విరుచుకు పడిన రోహిత్ 36 బంతుల్లో అర్ధశతకం చేశాడు. ఇది అతడి కెరీర్‌లో వేగవంతమైన అర్ధశతకం కావడం గమనార్హం.