YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు జ్ఞానమార్గం

అనుగ్రహించే ఆంజనేయుడు

అనుగ్రహించే ఆంజనేయుడు

హనుమంతుడు అపారమైన శక్తిమంతుడు. ఎంతటి బలసంపన్నుడో అంతటి సహన శీలి. దుష్టులను శిక్షించడానికీ ... శిష్టులను రక్షించడానికి మాత్రమే ఆయన తన శక్తిసామర్థ్యాలను వినియోగిస్తూ వుంటాడు. రామనామాన్ని స్మరించేవారినీ ... తనని పూజించేవారిని ఆయన కనిపెట్టుకుని వుంటాడు. ముఖ్యంగా చిన్నపిల్లల పట్ల ఆయన మరింత కరుణను కలిగి వుంటాడు.
చిన్నారుల శక్తిమేరకు తనని ఏవిధంగా ఆరాధిస్తూ వున్నా ఆయన మురిసిపోతుంటాడు. నిర్మలమైన మనసుతో తనకి చేతులు జోడిస్తే పరవశించిపోతుంటాడు. అలాంటి చిన్నారుల పట్ల ప్రీతితో వాళ్ల రక్షణ బాధ్యతను వహిస్తుంటాడు. అందుకే తల్లిదండ్రులు తమ
క్తిభావాలు పెరిగేలా చూసుకోవాలి. ఆంజనేయస్వామి పట్ల అపారమైన విశ్వాసం ఏర్పడేలా ప్రయత్నించాలి.
కొంతమంది పిల్లలు తరచూ అనారోగ్యానికి గురవుతుంటారు. చదువు విషయంలో మందకోడిగా ఉంటూ వెనుకబడుతుంటారు. నిద్రలో వులిక్కిపడుతూ ఉండటమే కాకుండా, ఒంటరిగా ఉండటానికి కూడా భయపడుతూ వుంటారు. తల్లిదండ్రులు అలాంటి పిల్లల తోడుగా ఉంటూ స్వామిని పూజించాలి. 
హనుమంతుడికి ప్రీతికరమైన మంగళవారం రోజున ఆ స్వామికి పదకొండు ప్రదక్షిణలు చేయిస్తూ వుండాలి. ఆకుపూజ గానీ .. సిందూర అభిషేకం గాని చేయించి, స్వామివారికి నైవేద్యంగా వడపప్పు - పానకం సమర్పిస్తూ వుండాలి. లేదంటే 'వడమాల' చేయించి సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన, ఆంజనేయస్వామి అనుగ్రహం లభిస్తుంది. ఆ స్వామి కటాక్షం వలన పిల్లల ఎదుగుదలను అడ్డుకునే అన్ని సమస్యలు తొలగిపోతాయి

Related Posts