YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

రగిలిపోతున్న ఏపీ..

రగిలిపోతున్న ఏపీ..

  కేంద్ర ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగిందంటూ వామపక్షాలు ఇచ్చిన పిలుపు మేరకు గురువారం రాష్ట్ర బంద్‌ చేపట్టింది.  విద్యా, వ్యాపార, వాణిజ్య సంస్థలు బంద్‌ సందర్భంగా స్వచ్ఛందంగా మూసివేయనున్నట్లు తెలిపాయి. ప్రభుత్వ సంస్థలు యధావిధిగా నడుస్తాయని అధికారవర్గాలు పేర్కొన్నా వాటినీ అడ్డుకుంటామని బంద్‌కు మద్దతు ఇస్తున్న ప్రజా సంఘాలు పేర్కొన్నాయి. కేంద్రం నుంచి ఏదో శుభవార్త వస్తుందని ఆశించామనీ అయితే తాము అనుకున్నదొకటి.. అయినదొక్కటి అని ఏపీ రగిలిపోతోంది. బడ్జెట్‌‌లో ఏపీకి అన్యాయం జరిగినప్పటికీ బుధవారం నాడు ప్రధాని మోదీ చేసిన ప్రసంగంలో కనీసం ఏపీకి ఇచ్చిన హామీలగురించి ప్రస్తావనకు రాకపోవడంతో ఏపీ నేతలు ఉసూరుమన్నారు. దీంతో  కేంద్ర బడ్జెట్‌లో ప్రత్యేక హోదా, రాష్ట్ర రాజధాని నిర్మాణం మొదలు పోలవరం నిర్మాణం, ప్రత్యేక రైల్వేజోన్‌ వంటి అంశాల ప్రస్తావన ఏదీ లేకపోవడాన్ని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు తీవ్రంగా ఆక్షేపించాయి.ఏపీలోని అన్ని పార్టీలు రోడ్డెక్కి ఆందోళనకు సిద్ధమయ్యాయి. కాగా పార్లమెంట్‌ వేదికగా ఏపీకి చెందిన టీడీపీ, వైసీపీ ఎంపీలు ఆందోళనలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఎంపీల పోరాటానికి మద్దతుగా మండల, నియోజకవర్గ, జిల్లా కేంద్రాల్లో ప్రదర్శనలు నిర్వహిస్తామని మంత్రి కళా వెంకట్రావు స్పష్టం చేశారు.

Related Posts