YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రన్న బీమా సంతృప్తి శాతం 62.5%

చంద్రన్న బీమా సంతృప్తి శాతం 62.5%

 దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో పనులు చేశామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. మంత్రులు, కార్యదర్శులు, హెచ్వోడీలతో వీడియో కాన్ఫ రెన్స్ నిర్వహించారు. ఈ సందర్బంగా చంద్రబాబు మాట్లాడుతూ ఈ త్రైమాసికంలో 11.25% వృద్ధిరేటునమోదయింది. ప్రజల మద్దతు లేకపోతే అనుకున్నంత ఫలితాలు రావు. దృష్టి కేంద్రీకరించి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని అన్నారు.  నాలుగేళ్ల క్రితం ఉన్న ఇబ్బందులను అధిగమించాం. లక్ష్యాలను నిర్దేశించుకుని పనిచేస్తున్నామని అన్నారు.  టెక్నాలజీని ఉపయోగించుకుని మెరుగైన ఫలితాలు సాధించాలని అన్నారు. చంద్రన్న బీమా సంతృప్తి శాతం 62.5%. ఏదన్నా తప్పులు జరిగితే వెంటనే సరిదిద్దే వ్యవస్థ ఉండాలి. దేశంలో ఎక్కడా లేని అభివృద్ధి ఏపీలో జరుగుతోందని అయన అన్నారు. ఎక్కువ కష్టపడితే 15% వృద్ధిరేటు సాధించటం కష్టం కాదు. ఈ ప్రభుత్వ హయాంలో అధికారులకు గౌరవం పెరిగిందని అన్నారు. ఈజ్ ఆఫ్ లివింగ్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొస్తున్నాం.  అత్యంత నివాసయోగ్య పరిస్థితులు కల్పిస్తున్నాం. మోస్ట్ లివబుల్ స్టాండర్డ్స్ సాధిస్తున్నాం. ఇంకా ముందుకు వెళ్లాలి, నాణ్యమైన మంచినీరిస్తున్నాం.  క్వాలిటీ ఆఫ్ హెల్త్ సాధిస్తున్నామని అన్నారు. కేంద్రం ఇచ్చిన మరొకరు ఇచ్చినా అవార్డులు మనకే వస్తున్నాయి.  మొత్తం వివిధ విభాగాలకు 50కి పైగా అవార్డులు వచ్చాయి.  పబ్లిక్ ని కన్విన్స్ చేయాలి. మీ కృషిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని అన్నారు.  ఇప్పటికే 550 అవార్డులను పొందామని పేర్కొన్నారు. నిన్ననే గృహ నిర్మాణంలో 13 అవార్డులు పొందామన్నారు. ప్రజల్లో పథకాలు, కార్యక్రమాల పట్ల సంతృప్తి స్థాయి పెరగాలన్నారు. 

Related Posts