- ఈ నెల 9 నుంచి 20 వరకు
తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ పది, ఇంటర్ వార్షిక పరీక్షలకు ఈ నెల 9 నుంచి 20 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని డైరెక్టర్ వెంకటేశ్వర శర్మ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 27వరకు రూ.25 ఆలస్య రుసుముతో , మార్చి 6 వరకు రూ.50 ఆలస్య రుసుముతో దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు.