మారుతి దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా రూపొందిన ‘శైలజారెడ్డి అల్లుడు’ సినిమా తొలి వారంలో ఫర్వాలేదనిపించుకునే స్థాయి వసూళ్లను రాబట్టింది. తమ సినిమాకు బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ వచ్చాయని దీని రూపకర్తలు ప్రకటించుకున్నారు. తొలి వీకెండ్‌లోనే ఈ సినిమా 23 కోట్ల రూపాయల స్థాయి వసూళ్లను సాధించిందని వారు ప్రకటించారు. ఇక తాజాగా ఈ సినిమా తొలి వారంలో సాధించిన షేర్ వసూళ్ల గురించి ట్రేడ్ వర్గాలు వివరాలను ఇస్తున్నాయి. నిన్నటితో ఈ సినిమా తొలి వారం ప్రదర్శనను పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో 16.80 కోట్ల రూపాయల షేర్‌ను సాధించిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇది డిస్ట్రిబ్యూటర్స్ షేర్. ఈ రకంగా చూస్తే తొలి వారంలో ఈ సినిమా దాదాపు 75 శాతం పెట్టుబడులను రాబట్టిందని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా ప్రీ రిలీజ్ మార్కెట్‌లో అమ్ముడైన మొత్తాల్లో 75 శాతం డబ్బును రాబట్టిందని అంటున్నాయి. ఈ సినిమాకు మరి కొంచెం అవకాశం ఉంది. ఈ వారంలో పెద్ద సినిమాలు ఏవీ విడుదల కావడం లేదు. ఇలాంటి నేపథ్యంలో ‘శైలజారెడ్డి అల్లుడు’ ఈ వీకెండ్లో కూడా కొంత వరకూ వసూళ్లను రాబట్టుకునే ఛాన్సు ఉంది. రేపు విక్రమ్ ‘సామి స్క్వైర్’, సుధీర్ బాబు సినిమా.. తదితర సినిమాలు విడుదల కానున్నాయి.