ప్రముఖ క్రికెటర్ సచిన్ తెందూల్కర్ జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయం ప్రదానం చేసిన గౌరవ డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్‌ను తిరస్కరించారు. ఈ ఏడాది డిసెంబరు 24న విశ్వవిద్యాలయంలో జరిగే 63వ వార్షిక స్నాతకోత్సవాల్లో భాగంగా సచిన్‌కు ఈ పురస్కారం ఇవ్వాలని నిర్ణయించారు. నైతిక కారణాల దృష్ట్యా ఆయన ఈ పురస్కారాన్ని అందుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. చాలా కాలంగా ఆయన ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారు. ఇలాంటి అవార్డులు తీసుకోవడం నైతికంగా తప్పు అని సచిన్ అభిప్రాయపడ్డారు’ అని దాస్ తెలిపారు.దీంతో ఆ పురస్కారాన్ని ప్రముఖ బాక్సర్ మేరీకోమ్‌కి ఇవ్వాలని గవర్నర్ కేసరీనాథ్ త్రిపాఠి నిర్ణయించారు. మేరీ కోమ్ తో పాటు ప్రముఖ హెమటాలజిస్ట్, టాటా మెడికల్ సెంటర్ డా. మమ్మెన్ చాందీ, ప్రముఖ ఆర్థిక వేత్త కౌశిక్ బసు, బ్యాంకింగ్ రంగానికి చెందిన చంద్ర శేఖర్ ఘోష్‌లు డాక్టరేట్ ఆఫ్ లిటరేచర్ పురస్కారాన్ని స్వీకరించనున్నారు. వీరితో పాటు జీవశాస్త్ర వేత్త దీపాంకర్ ఛటర్జీకి డాక్టరేట్ ఆఫ్ సైన్స్‌ను ఇవ్వనున్నారు.అయితే, తెందూల్కర్ ఇలాంటి పురస్కారాలను తిరస్కరించడం ఇదే తొలిసారి కాదు. 2011లోనూ ఆయన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇవ్వాలనుకున్న డాక్టరేట్‌ను సైతం వద్దన్నారు. నైతిక కారణాల దృష్ట్యా సచిన్ ఈ నిర్ణయం తీసుకున్నారని ఆ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ సురంజన్ దాస్ తెలిపారు. ఆయనకు ఈ మెయిల్ ద్వారా సమాచారం కూడా అందించాం. కానీ, ఆయన మా విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు.