భారత సారధి విరాట్ కోహ్లీ ఫై సంచలన వ్యాఖ్యలు చేసాడు పాక్ మాజీ క్రికెటర్ తన్వీర్ అహ్మద్. ఆసియాకప్ నుంచి కోహ్లీ పారిపోయాడని వ్యాఖ్యానించాడు. ఓ మీడియాతో మాట్లాడుతూ 'నా అంచనా ప్రకారం పాకిస్థాన్ జట్టుకు భయపడే కోహ్లీ ఆసియాకప్ నుంచి పారిపోయాడు. ఇంగ్లాండ్‌తో అతడు అన్ని సిరీస్‌లూ ఆడాడు. అప్పుడు కొద్ది రోజులు మాత్రమే వెన్నునొప్పితో బాధపడ్డాడు. మిగతా రోజులన్నీ బాగానే ఆడాడు. దేశంకోసం ఇంగ్లాండ్‌తో ఆడిన వ్యక్తి ఆసియాకప్ ఆడలేడా?. ఇండియా పాకిస్థాన్‌తో ఫైనల్స్‌తో సహా మూడు సార్లు తలపడాల్సివస్తుందని కోహ్లీ ముందే ఊహించి ఉంటాడు. అందుకే ఎస్కేప్ అయ్యాడు’ అంటూ వ్యాఖ్యానించాడు. దీనిపై భారత్ మాజీ ఓపెనర్ గంభీర్ ఘాటుగా స్పందించాడు. ‘విరాట్ కోహ్లీ పేరుమీద ఇప్పటికే 35-36 సెంచరీల రికార్డు ఉంది. అతనికి మరో సెంచరీ కొట్టడం పెద్ద కష్టమేమీ కాదు. తన్వీర్ పేరుమీద కనీసం 36 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడిన దాఖలాలు లేవు. అది గుర్తు పెట్టుకుంటే మంచిది’ అంటూ సమాధానం ఇచ్చాడు.