YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

వంగవీటి పొలిటికల్ కెరీర్ క్లోజా...

వంగవీటి పొలిటికల్ కెరీర్ క్లోజా...

తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో వంగవీటి పేరు చెపితేనే ఓ సంచనలం. ఇంకా చెప్పాలంటే విజయవాడలో వంగవీటి పేరు లేకుండా గత నాలుగు దశాబ్దాలుగా రాజకీయమే లేదు. అలాంటి చోట ఇప్పుడు వంగవీటి వారసుడు రాధా పొలిటికల్ కేరీర్ క్లోజ్ అవ్వనుందా ? రాధా పొలిటికల్ కేరీర్ క్లోజ్ అవ్వడానికి భాధ్యులు ఎవరు? విజయవాడ రాజకీయాల్లో తాజాగా ఏం జరుగుతోంది ? అన్నది చూద్దాం. దివంగత కాపు నేత, మాజీ ఎమ్మెల్యే వంగవీటి మోహనరంగా వారసుడిగా 2004లో 26 సంవత్సరాలకే పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన వంగవీటి రాధా నాడు విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి తక్కువ వయస్సులోనే ఎమ్మెల్యేగా విజయం సాధించారు. దివంగత మాజీ ముఖ్య మంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రోత్సాహంతో చిన్న వయస్సులోనే ఎమ్మెల్యే సీటు దక్కించుకున్న రాధా నాటి కాంగ్రెస్ గాలిలో 26 వేల ఓట్ల భారీ మెజార్టీతో విజయం సాధించి అతి చిన్న వయస్సులోనే అసెంబ్లీలోకి అడుగు పెట్టి రెకార్డ్ క్రియేట్ చేశారు.వంగవీటి వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రాధా గ్రాఫ్ వాస్తవంగా చూస్తే ఆ కుటుంబానికి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న అభిమానుల నేపథ్యంలో ఎంతో ఉన్నత శిఖరాలకు చేరాల్సి ఉంది. అయితే రాజకీయంగా రాధా వేసిన రాంగ్ స్టెప్పుల నేపథ్యంలో ఆయన పొలిటికల్ కెరీర్ ప్రస్తుతం చేజేతులా నాశనం అయ్యినట్టే కనిపిస్తోంది. 2004లో తొలి సారి ఎమ్మెల్యేగా గెలిచిన రాధాకు వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి గట్టి మద్దతు లభించింది. అయితే తక్కువ వయస్సులోనే ఎమ్మెల్యేగా ఛాన్స్ వచ్చినా తనదైన ముద్ర వేయకుండా కాంట్రవర్సీలు, అధికారులతో విబేధాలతోనే సరిపుచ్చారు. 2009లో రాధా తన సామాజికవర్గానికి చెందిన సినీ నటుడు చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యంలోకి జంప్ చేసేశారు.ఆ ఎన్నికలకు ముందు రాజశేఖర్ రెడ్డి నువ్వు పార్టీ మారవద్దు… మీ నాన్న కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో త్యాగం చేశారు.. ఈ సారి మన ప్రభుత్వమే అధికారంలోకి వస్తుంది, నిన్ను కేబినెట్లోకి తీసుకుంటానని చెప్పారు… అయినా వైఎస్ మాటను పెడచెవిన పెట్టిన రాధా ప్రజారాజ్యంలోకి జంప్ చేసేశారు. ఆ ఎన్నికల్లో విజయవాడ సెంట్రల్ సీటు నుంచి పోటీ చేసి మల్లాది విష్ణు చేతిలో 600 ఓట్ల తేడాతో ఓడిపోయారు. రాధా ప్రజారాజ్యంలోకి జంప్ చెయ్యడంతోనే ఆయన తొలి రాంగ్ స్టెప్ ఆయన కెరీర్ ఎదుగుదలను చాలా వరకు దెబ్బతీసింది. గత ఎన్నికలకు ముందు వైసీపీలోకి జంప్ చేసిన రాధా మళ్లీ రాంగ్ స్టెప్ వేశారు. తనకు పట్టున్న సెంట్రల్ సీటును వదిలి విజయవాడ తూర్పు నుంచి పోటీ చేశారు.ఆ ఎన్నికల్లో కూడా గద్దె రామ్మోహన్ చేతిలో వరుసుగా రెండో సారి ఓడిపోయారు.

రెండు సార్లు వరుసుగా ఎన్నికల్లో ఓడిపోతూ వస్తుండడంతో పాటు పార్టీలు మారడంతో రాధాకు స్టేట్ వైడ్గా ఉన్న క్రేజ్ సంగతేమో గాని చివరకు విజయవాడ నగరంలో సైతం అస్థిత్వం నిలుపుకునేందుకు పోరాటం చెయ్యాల్సిన పరిస్థితి వచ్చింది. గత ఎన్నికల్లో తూర్పు నుంచి పోటీ చేసి ఓడిన రాధా ఆ తర్వాత పట్టు బట్టి తిరిగి సెంట్రల్ నియోజకవర్గానికి వెళ్లారు. నిన్నటి వరకు సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్గా ఉన్నా రాధాకు మరో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు వైసీపీలో చేరడంతో రాధాకు ఇబ్బందులు తప్పలేదు. వచ్చే ఎన్నికల్లో గెలవని పక్షంలో రాధా పొలిటికల్ ముగిసినట్టే. ఈ క్రమంలోనే ఆయనకు కాస్తో కూస్తో సెంట్రల్ సీటులోనే గెలిచేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయి. అయితే జగన్కు రాధాపై సధాభిప్రాయం లేకపోవడంతో సెంట్రల్ సీటును మల్లాది విష్ణుకు కేటాయించారుఎట్టి పరిస్థితుల్లోనూ రాధాకు సెంట్రల్ సీటు ఇచ్చే ప్రసక్తే లేదని పార్టీ అధిష్టానం కుండ బద్దలుకొట్టడంతో రాధా వైసీపీలో ఇమిడే పరిస్థితులు లేవు. ఆయనను పార్టీలో పొమ్మన్నలేక పొగ పెట్టినచెందంగా వ్యవహరిస్తున్నారు. రాధాకు పట్టులేని విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి సీటు ఇస్తామని ఆయనకు అదీకాని పక్షంలో బందరు ఎంపీ సీటు ఇస్తామని వైసీసీ అధిష్టానం కండీషన్లు పెడుతుందే తప్పా సెంట్రల్ సీటు మాత్రం ఇచ్చేది లేదని తేల్చేసింది. దీనిని బట్టీ చూస్తే వైసీపీలో రాధాను బయటకు పంపే చర్యలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక అయితే గియితే ప్రస్తుతం రాధాకు జనసేన ఒక్కటే ఆప్షన్గా ఉంది. ఇప్పటికే ఆయన తన అనుచరులతో ఏం చెయ్యాలా అన్నదానిపై సమాలోచన జరుపుతున్నారు. వైసీపీలో ఉన్నా విజయవాడ తూర్పు, బందరు ఎంపీ సీటే తప్ప సెంట్రల్ సీటు దక్కే పరిస్థితి లేదు. ఈ క్రమంలో ఆయన ఏం చేస్తారు ? అన్నది చూడాల్సి ఉంది. ఏదేమైనా రాధా పొలిటికల్ కేరీర్ ఆయన వేసిన రాంగ్ స్టెప్పలతోనే ముగింపు దశకు చేరుకుందన్నది రాజకీయవర్గాల్లో వినిపించే టాక్.

Related Posts