YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

బీజేపీలో మళ్లీ అద్వానీ చరిష్మా

బీజేపీలో మళ్లీ అద్వానీ చరిష్మా

ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ప్రధాని నరేంద్ర మోదీ, భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అమిత్ షాలు తమ వ్యూహాలను మారుస్తున్నారు. ప్రజల్లోనూ, పార్టీలోనూ తమది నియంతృత్వం కాదని, దేశమంతా కాషాయ జెండా రెపరెపలాడాలన్నదే తమ ధ్యేయమన్న సంకేతాలను పంపే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే సీనియర్ నేతలు ఎల్.కె. అద్వాని, మురళిమనోహర్ జోషిలను వచ్చే లోక్ సభ ఎన్నికల్లో పోటీ చేయించాలని నిర్ణయించారు. కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీని 2019 ఎన్నికల్లో గాంధీనగర్ లోక్ సభ నియోజకవర్గం నుంచే పోటీ చేస్తారని పార్టీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.ఇటీవల కాలంలో మోదీ ప్రభావం మసకబారుతుంది. దేశవ్యాప్తంగా బీజేపీకి ప్రతికూల పవనాలు వీస్తున్నాయన్న వార్తలు వస్తున్నాయి. వచ్చే ఐదు రాష్ట్రాల ఎన్నికలు, ఆ తర్వాత జరిగే లోక్ సభ ఎన్నికల్లో గెలుపు కమలం పార్టీకి కీలకం. మరోవైపు విపక్షాలన్నీ ఐక్యమవుతున్నాయి. ఇటీవల వాజ్ పేయి మరణించడంతో ఆయనకు దేశవ్యాప్తంగా పెల్లుబుకిన సానుభూతిని చూసిన కమల దళపతులు తమ మనసును మార్చుకున్నట్లుంది. మిత్రపక్షమైన శివసేనతో సహా అన్ని పార్టీలూ వాజ్ పేయినాటి బీజేపీ కాదని, మోదీ, అమిత్ షాలు నియంతలుగా వ్యవహిస్తూ పార్టీని, ప్రభుత్వాన్ని శాసిస్తున్నారని పదే పదే విమర్శలు చేస్తున్నాయి. దీంతో పునరాలోచనలో పడిన ఈ ఇద్దరూ అద్వానీని తిరిగి పోటీ చేయించాలని నిర్ణయించుకున్నట్లు చెబుతున్నారు.2014 ఎన్నికల తర్వాత బీజేపీకి దేశ వ్యాప్తంగా అనుకూల పవనాలు వీచి సొంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసే బలాన్ని సమకూర్చుకుంది. ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అవసరమైన బలమన్నా మిత్రపక్షాలతోనే కలసి సర్కారును ఏర్పాటు చేశారు. అయితే బీజేపీలో సీనియర్ నేతలైన అద్వానీ, మురళీ మనోహర్ జోషిలను పక్కన పెట్టేశారు. మార్గదర్శి మండలి అనే దాన్ని సృష్టించి నామమాత్రంగా అద్వానీకి ఒక పదవిని కల్పించారు. ఇలా అద్వానీ, మురళి మనోహర్ జోషిలకు జరుగుతున్న అన్యాయంపై బీజేపీలోనే కొందరు నేతలు పెదవి విరిచినా ప్రయోజనం లేదు.నిజానికి భారతీయ జనతా పార్టీ నిర్ణయం ప్రకారం 75 ఏళ్ల వయస్సు మించిన వారికి లోక్ సభ టిక్కెట్లు ఇవ్వకూడదు. ఇది అన్ని రాష్ట్రాల్లో అమలు పరుస్తున్నారు. కాని అద్వానీ, జోషి విషయంలో దీనికి మినహాయింపు ఇవ్వాలని భావించారు. వాజ్ పేయి తర్వాత అంత చరిష్మా కలిగిన అద్వానీకి అన్యాయం చేశారన్న అపప్రదను తొలగించేందుకే మళ్లీ సీటు కేటాయింపును తెరపైకి తెచ్చారన్న వాదన లేకపోలేదు. ఇద్దరూ స్వయంగా అద్వానీ ఇంటికి వెళ్లి మరీ మళ్లీ పోటీ చేయాల్సిందిగా అభ్యర్థించినట్లు ప్రచారం జరుగుతోంది. అద్వానీ, జోషిలను ప్రచారంలోకి దించాలని కూడా వీరు భావిస్తున్నారు. మొత్తం మీద మళ్లీ ఈ ఇద్దరికీ అద్వానీ మళ్లీ గుర్తుకు వచ్చారంటూ సోషల్ మీడియాలో సెటైర్లు విన్పిస్తున్నాయి.

Related Posts