సమర్పణ: శ‌్రీమతి రాణి పోసాని
నిర్మాణ సంస్థ: సుధీర్‌బాబు ప్రొడక్షన్స్
తారాగణం: సుధీర్‌బాబు, నభా నటేశ్, నాజర్, తులసి, సుదర్శన్, పృథ్వీ, జీవా, వైవా హర్ష తదితరులు
సంగీతం: అజనీశ్ లోక్‌నాథ్
ఛాయాగ్రహణం: సురేశ్ రగుతు
కూర్పు: ఛోటా కె.ప్రసాద్
నిర్మాత : సుధీర్‌బాబు
దర్శకత్వం : ఆర్.ఎస్.నాయుడు
కథ:
కార్తిక్ (సుధీర్‌బాబు) సాఫ్ట్ వేర్ ఇండస్ట్రీలో పనిచేస్తుంటాడు. యు.ఎస్.వెళ్లాలన్నది అతని గోల్. తన టీమ్ మొత్తానికి అతనంటే సింహ స్వప్నం. ఎలాంటి టార్గెట్ని అయినా అతను చాలా తేలిగ్గా కంప్లీట్‌చేస్తాడు. ప్రేమా, పెళ్లి మీద పెద్ద ఒపీనియన్ ఉండదు. దాంట్లో తన మేనమామ చెప్పిన ఓ ప్రపోజల్‌ను అంగీకరిస్తాడు. అయితే అతని మరదలికి వేరే వ్యక్తితో ప్రేమ వ్యవహారం ఉందని తెలిసి.. తాను మరో అమ్మాయిని ప్రేమిస్తున్నట్టు తండ్రితో చెబుతాడు. తాను ప్రేమించే సాఫ్ట్ వేర్ అమ్మాయి సిరి గా మేఘన (నభా నటేష్)ని పరిచయం చేస్తాడు. మేఘన ఓ వైపు కాలేజీ చదువుతూ మరోవైపు షార్ట్ ఫిల్మ్స్ లో యాక్ట్ చేస్తుంటుంది. క్రమంగా కార్తిక్ ప్రేమలోపడుతుంది సిరి. అయితే ఆ విషయాన్ని చెప్పేలోపు అతని వేరే మార్గం మీద దృష్టి పెడుతున్నాడని తెలుసుకుంటుంది. మరో సందర్భంలో అతను రియలైజ్ అయ్యే సమయానికి సిరి వేరే కమిట్‌మెంట్ చేసుకుంటుంది. మరి ఒకరి మీద ఒకరికి ప్రేమ ఉన్నప్పటికీ వాళ్లు విడివిడిగా బతుకుతారా? లేకుంటే ఒకరినొకరు ఏదో ఒక సందర్భంలో అర్థం చేసుకుంటారా? నిజంగా అర్థం చేసుకుంటే వాళ్లకు సహకరించిన అంశాలేంటి? వంటివి ఆసక్తికరం.
ప్లస్ పాయింట్స్:
- నటీనటుల పనితీరు
- వైవా హర్ష కామెడీ ట్రాక్
- కెమెరా వర్క్
మైనస్ పాయింట్స్:
- కథలో కొత్తదనం లేదు
- సెకండాఫ్ అంతా ఎమోషన్స్‌తో నడిపించాలనే ప్రయత్నం ఎక్కువగా కనపడింది.. కానీ కామెడీ ఆకట్టుకునేలా ఉండుంటే సెకండాఫ్ ఇంకా కనెక్ట్ అయ్యుండేది
- హీరోయిన్ క్యారెక్టర్‌ను చూస్తుంటే.. బొమ్మరిల్లు హాసిని పాత్ర గుర్తుకు వచ్చింది
- సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్
విశ్లేషణ:
సుధీర్‌బాబు సొంత ప్రొడక్షన్ హౌస్ పెట్టి చేసిన సినిమా అని అనగానే అందరికీ ఆసక్తి వచ్చేసింది. థియేటర్లలో సీట్లు కూడా కాసింత నిండుగానే కనిపించాయి. సుధీర్‌బాబు టఫ్ బాస్‌గా బాగానే చేశాడు. హీరోయిన్ పాత్ర అనుక్షణం `బొమ్మరిల్లు`లోని హాసినిని గుర్తు చేసింది. పుష్కరకాలంగా ఇలాంటి కేరక్టర్లు చాలానే వస్తున్నాయి. నభా నటేశ్ తన పాత్రను చాలా ఈజ్‌తో హ్యాండిల్ చేసింది. ఒక్కో యాంగిల్‌లో ఒక్కో హీరోయిన్‌ను గుర్తుచేశాయి ఆమె ఎక్స్ ప్రెషన్స్. తన తండ్రి నిత్యం పొలానికి వెళ్తుంటే.. ఆయన వెళ్తున్నది పొలం కోసమని అనుకున్న కొడుక్కి, పోగొట్టుకున్న బంధాలను వెతుక్కుంటున్నారని తెలియడానికి చాలా సమయమే పడుతుంది. ఈ సినిమాలో కార్తీకే కాదు.. నిజ జీవితంలోనూ చాలా మంది యువత తమకు ఏం కవాలో, దేనికోసం పరుగులు పెడుతున్నారో అర్థం కాకుండా హడావిడి పడుతున్నారు. అలాంటి వారికి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. ఊర మాస్ డ్యాన్సులు, పాటలు, ఫైట్లు వంటివి ఎదురుచూస్తే మాత్రం చిత్రం నిరుత్సాహపరుస్తుంది. నిర్మాణ విలువలు బావున్నాయి. పాటలుగానీ, నేపథ్య సంగీతం గానీ పెద్దగా ఆకట్టుకోలేదు. తొలి, మలి పాటలను తీసిన విధానం బావుంది. హర్ష వైవా డైరక్షన్ చేసే సన్నివేశాలు కడుపుబ్బా నవ్విస్తాయి.