YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

పార్టీకి బాబు పట్టుకోల్పోతున్నారా.... గాడి తప్పుతున్న తమ్ముళ్ల ప్రవర్తన

పార్టీకి  బాబు పట్టుకోల్పోతున్నారా.... గాడి తప్పుతున్న తమ్ముళ్ల ప్రవర్తన

కొన్ని విష‌యాలు చాలా ఆస‌క్తిగా వింత‌గానూ ఉంటాయి. ఏపీ అధికార పార్టీ టీడీపీ అంటేనే క్ర‌మ‌శిక్ష‌ణ‌కు మారుపేరు. క్ర‌మ శిక్ష‌ణ‌కు ప‌ర్యాయ‌ప‌దంగా కూడా టీడీపీ పేరే వినిపిస్తుంది. అటు కింది స్థా కార్య‌కర్త నుంచి పైస్థాయి ఎమ్మెల్యేలు, ఎంపీలు మంత్రులు ఇలా ప్ర‌తి ఒక్క‌రూ కూడా క్ర‌మ‌శిక్ష‌ణ‌కు క‌ట్టుబ‌డి ఉండాల్సిందే. అయితే ఇదంతా గ‌తం గ‌తః. చంద్ర‌బాబు తొలిసారి సీఎం అయిన‌ప్పుడు పార్టీలో ఎంతో క్ర‌మ‌శిక్ష‌ణ ఉండేది. 2004 ఎన్నిక‌ల్లో ఓడిపోయాక కూడా తోక‌జాడించిన కొంత‌మంది సీనియ‌ర్ల‌ను బాబు నిర్దాక్షిణ్యంగా సస్పెండ్ చేశారు. దీంతో ఎవ్వ‌రూ బాబును ఎదిరించేందుకు సాహ‌సించ‌లేదు. అయితే ప‌దేళ్ల త‌ర్వాత పార్టీ అధికారంలోకి వ‌చ్చాక మాత్రం పార్టీలో క్ర‌మ‌శిక్ష‌ణ పూర్తిగా గాడి త‌ప్పేసింది.ఇది నాలుగేళ్ల‌లో రానురాను త‌గ్గుతోంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. ముఖ్యంగా నీతులు చెబుతున్న చంద్ర‌బాబే త‌ప్పులు చేస్తుండ‌డంతో నాయ‌కులు సైతం త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. నిన్న‌టి వ‌ర‌కు కూడా అసెంబ్లీ స‌మావేశాలు జ‌రిగాయి. అయితే, వీటిని విప‌క్షం వైసీపీ బాయ్ కాట్ చేసింది. కానీ, అధికార పార్టీ ఎమ్మెల్యేలే విప‌క్ష నాయ‌కులు మాదిరిగా ప్ర‌భుత్వంపై ప్ర‌శ్న‌ల వర్షం కురిపించి స‌మాధానాల‌ను రాబట్టారు. అయితే, దీనిని కూడా పెద్ద ఎత్తున త‌న‌కు అనుకూలంగా మ‌లుచుకున్న చంద్ర‌బాబుకు సొంత పార్టీ ఎమ్మెల్యేలు ఝ‌ల‌క్ ఇచ్చారు. బాబు ఎన్నిసార్లు విజ్ఞ‌ప్తి చేసినా.. దాదాపు 40 మంది ఎమ్మెల్యేలు మాత్రం త‌మ ఇష్టానుసారంగా వ్య‌వ‌హరిస్తున్నారు.గ్రామ దర్శిని కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికి రెండు నెలలైనా కేవలం ఇరవై శాతం మాత్రమే పూర్తయిం దని, వచ్చే నాలుగు నెలల్లో దీనిని పూర్తి చేయాలని చంద్రబాబు కోర‌డం పార్టీ నేత‌ల ప‌నితీరుకు అద్దం ప‌డుతోంది. ఇక‌, అసెంబ్లీలో ఎమ్మెల్యేల పనితీరుపై బాబు తీవ్రంగా సంతృప్తి వ్యక్తం చేశారు. మొ త్తం 125 మంది ఎమ్మెల్యేల్లో 88 మంది మాత్రమే అన్ని రోజులూ హాజరయ్యారని పెద‌వి విరిచారు. 10 మంది కేవలం 4 రోజులు రాగా, 19 మంది 5 రోజులు వచ్చారని చెప్పారు. చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌ ఒక్క రోజే అసెంబ్లీకి హాజ‌రై.. ఆ త‌ర్వాత ఆయ‌న క‌నిపించ‌కపోవ‌డం గ‌మ‌నార్హం. ఎమ్మెల్సీల హాజరు వివరాలు ఇవ్వక పోవడం పై విప్‌లను మందలించారు.ఇక‌, అత్యంత కీల‌క‌మైన‌ టీడీఎల్పీ సమావేశానికి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిపి మొత్తం 167 మంది హాజరు కావాల్సి ఉండగా 89 మంది మాత్ర మే రావ‌డం మ‌రింత ఆవేద‌నకు దారితీసింది. ఈ ప‌రిణామాల‌ను గ‌మ‌నిస్తే.. పార్టీ నేత‌లపై చంద్ర‌బాబుకు ప‌ట్టు స‌డ‌లుతోంద‌నే వ్యాఖ్య‌లు జోరుగా వినిపిస్తుండ‌డం గ‌మ‌నార్హం. మ‌రి రాబోయే రోజుల్లో దీనిని ఎలా స‌రిచేస్తారో చూడాలి

Related Posts