ఆసియాకప్‌లో భారత్ జైత్రయాత్ర సాగుతోంది. సమష్టి ఆటతీరును కనబరుస్తూ శుక్రవారం జరిగిన సూపర్ ఫోర్ తొలి మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌పై 7 వికెట్ల తేడాతో నెగ్గింది. రోహిత్ శర్మ (83 నాటౌట్; 104 బంతుల్లో 5×4, 3×6) కనువిందు చేశాడు. తన సొగసరి బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. అర్ధశతకంతో అదరగొట్టాడు. అతడికి తోడుగా శిఖర్ ధావన్ విజృంభించడంతో బంగ్లాదేశ్‌తో జరిగిన మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. ప్రత్యర్థి నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్ల తేడాతో ఛేదించింది.