రాయలసీమలో నిర్లక్ష్యానికి గురైన ప్రాజెక్టులు పూర్తి చేయడానికి ఇద్దరు సీఎం లే కృషిచేశారు. ఎన్టీఆర్, చంద్రబాబు మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులు పూర్తిచేయగలుగుతున్నారని మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. శనివారం అయన మీడియాతో మాట్లాడారు. నాలుగేళ్లలో టీడీపీ ప్రభుత్వం 58 వేల కోట్లు ఇరిగేషన్ శాఖ ఖర్చు చేసింది. కీలకమైన అవుకు టన్నల్, గోరుకళ్ళు రిజర్వాయర్ టీడీపీ హయాంలోనే పూర్తిచేసాం..సీఎం చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తున్నామని అన్నారు. అవుకు ట న్నల్ 2007 లో టెండర్లు పిలిస్తే, మైనస్ 27 శాతానికి టెండర్ వేస్తే కమీషన్ల కోసం 6 నెలలు ఫైనల్ చేయలేదు. అవుకు సొరంగం పనుల్లో వై ఎస్ హయాంలో అక్రమాలపై జగన్ సమాధానం చెప్పాలి. వై ఎస్ జలయజ్ఞం ని ధనయజ్ఞం చేశారు. పులివెందుల రైతులకు నీళ్లిచ్చిన ఘనత చంద్రబాబుదని అన్నారు. కుప్పం లో చంద్రబాబుని గెలిపిస్తున్నారని టీచర్ పోస్టులు భర్తీ చేయకుండా, నీళ్లు ఇవ్వకుండా వైఎస్ అడ్డుకున్నారు. ఏపీలో 15 శాతం , 38 శాతం రాయలసీమలో , కర్నూలు జిల్లాలో 41 శాతం వర్షపాతం తక్కువ నమోదయిందని మంత్రి వెల్లడించారు.