వైసిపికి, బిజెపికి మధ్య కోవర్టు కన్నా లక్ష్మినారాయణ. బిజెపి నేత రాం మాధవ్ కు చీము నెత్తురు ఉంటే వైసిపి తో కలుస్తున్నామని ప్రకటించాలని టీడీపీ అధికార ప్రతినిధి పంచుమర్తి అనురాధ అన్నారు. శనివారం నాడు ఆమె మీడియాతో మాట్లాడారు. రాం మాధవ్ క్యారెక్టర్ ఏంటో అందరికీ తెలుసు. కాకినాడలో మాట్లాడినవన్నీ అబద్ధాలే. చంద్రబాబు ను విమర్శించే స్ధాయి రాం మాధవ్ కు లేదు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో చంద్రబాబుకు నోటీసులపై బిజెపి నేతలు సమాధానం చెప్పాలి. బిజెపి, వైసిపి, పవన్ చంద్రబాబు పై వ్యక్తిగత కక్ష్యతోనె కుట్రలు పన్నుతున్నారని ఆమె ఆరోపించారు.