ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రాజ్యసభ సభ్యుడు, బీజెపీ నాయకుడు జీవిఎల్ నర్సింహారావు మరోసారి విరుచుకు పడ్డారు. ఏపీలో భూటకపు పాలన కొనసాగుతోందని ఆయన ఆరోపించారు. సీఎం చంద్రబాబు అమెరికా పర్యటనకు వెళ్తున్నది ఒకటి. చెప్పేది ఒకటిన్నారు. ఐక్యరాజ్య సమితిలో ఏ మీటింగ్ కు సీఎం వెళ్తున్నారో వారు పంపిన ఇన్విటేషన్ ఏమిటో బైట పెట్టాలని డిమాండ్ చేసారు. వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వారు పెడుతిన్న సమావేశంకు వెళ్తూ ఐక్యరాజ్య సమితి సమావేశంకు వెళ్తున్నామని అబద్ధపు ప్రచారం చేసుకుంటున్నారని జీవిఎల్ అన్నారు. సీఎం చంద్రబాబు విమానం ఎక్కే లోపు ఐక్యరాజ్య సమితి పంపిన ఇన్విటేషన్ మీడియా కు విడుదల చెయాలని కోరారు.