YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

నిపుణుల కమిటీ సలహా మేరకే ఋణ మాఫీకి బదులుగా ‘పసుపు కుంకుమ స్త్రీ శిశు సంక్షేమం, శాఖ మంత్రి పరిటాల సునీత

నిపుణుల కమిటీ సలహా మేరకే ఋణ మాఫీకి బదులుగా  ‘పసుపు కుంకుమ           స్త్రీ శిశు సంక్షేమం, శాఖ మంత్రి  పరిటాల సునీత

పసుపు కుంకుమ పథకమునకు సంబంధించిలబ్దిదారులు అయిన సంఘ సభ్యులనుంచి వినియోగ దృవీకరణ పత్రం తీసుకోవడాన్ని వక్రీకరించి ఒక దిన పత్రికలో ప్రచారం చేయడాన్ని రాష్ట్ర స్త్రీ శిశు సంక్షేమం, సెర్ప్ శాఖ మంత్రి పరిటాల సునీత ఖండించారు.ఈ విషయమై మంత్రి వెంకటాపురంలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశం లో మాట్లాడుతూ నిపుణుల కమిటీ సలహా మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఋణ మాఫీకి బదులుగా  ‘పసుపు కుంకుమ/ పెట్టుబడి నిధి’ క్రింద 31.3.2014 నాటికి సంఘంలో సభ్యురాలిగా ఉన్న ప్రతి ఒక్కరికి రూ. 10,000/- చొప్పున మంజూరు చేయడం జరిగిందన్నారు.  దీనివలన లోను తీసుకున్న వారికి, తీసుకొని తిరిగి కట్టిన వారికి, కట్టాల్సిన వారికి, అసలు లోను  తీసుకోనివారికి అందరికీ సమాన ప్రోత్సాహం  ఇవ్వాలనేదే ప్రభుత్వ ముఖ్య ఉద్దేశ మన్నారు. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాలలో ఉన్న 8 లక్షల 54 వేల సంఘాలలోని 86,04,304 మంది సభ్యులకు మొత్తం పెట్టుబడి నిధి / పసుపు కుంకుమ క్రింద రూ. 8,604.30 కోట్లుగా మంజూరు చేయడం జరిగినదన్నారు. ఆ మొత్తంలో  ఇప్పటి వరకు మూడు విడతలలో రూ. 6,883.44 కోట్లు నిధులు వారి సంఘ బ్యాంకు ఖాతాలలో జమచేయడం జరిగినదన్నారు. అంతే కాకుండా, డ్వాక్రా సంఘాలకు ఫిబ్రవరి 2014 నుండి ఇప్పటి వరకు వడ్డీ రాయితీ క్రింద రూ. 2,514 కోట్లు ఇవ్వడం జరిగిందని మంత్రి తెలియజేశారు. ఇప్పటి వరకు ప్రభుత్వం సంఘాల బలోపేతానికి పెట్టుబడి నిధి/పసుపు కుంకుమ మరియు వడ్డీ రాయితీ ద్వారా రూ. 9,397.44 కోట్లు ఋణ మాఫీకి ప్రత్యామ్నయం గా ఇవ్వడం జరిగిందన్నారు. త్వరలో ఇవ్వబోయే రూ. 3995.91 కోట్లతో (రూ. 1720.864 కోట్లు పసుపు కుంకుమ + రూ.2275.05 కోట్లు వడ్డీ రాయితీ) కలుపుకొని ఈ సహాయం మొత్తం రూ. 13,393.35 కోట్లు డ్వాక్రా  రుణమాఫీ కన్నా ఎక్కువ అవుతుందన్నారు. అన్ని సంఘాలు ప్రతి సంవత్సరం సక్రమముగా అప్పులు తీసుకొని చెల్లిస్తున్నాయి. 2014-15 నుండి 2017-18 సంవత్సరాలలో రూ.51,745 కోట్లు వడ్డీ లేని ఋణాలుగా తీసుకొని ఉపయోగించుకొన్నారు. ప్రతి సంవత్సరం ఋణాల చెల్లింపులో  98% రికవరితో డ్వాక్రా సంఘాలు భారత దేశములోనే ఆదర్శముగా నడుపుబడుతున్నాయని మంత్రి అన్నారు. ఈ విషయాలను 1. మా డ్వాక్రా సభ్యులకు తెలియచేయడానికి 2. బ్యాంకర్ల నుండి ఉన్న సమస్యలను తొలిగించడానికి 3. 31.03.2014 నాటికీ   సంఘం/సభ్యురాలు ఎవరికైనా అర్హత ఉండి పసుపు కుంకుమ అందనట్లు అయితే అటువంటి సభ్యులను/సంఘాలను గుర్తించి వారికి  కూడా పసుపు కుంకుమ లబ్ధి అందచేయడం కోసమే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నదని మంత్రి తెలియజేశారు. ఈ కార్యక్రమములో  ప్రతి సంఘము పొదుపు ఖాతాకు జమచేసిన పసుపు కుంకుమ మరియు వడ్డీ రాయితీ వివరాలను ప్రతి సభ్యురాలికి వారి సంఘం పాస్ బుక్ లో బ్యాంకు వారు నమోదు చేసిన వివరాలును,  వారికి  చూపించి తెలియచేయడం జరుగుతుందన్నారు. అన్ని ప్రభుత్వ పథకాలలో  నిధులు మంజూరుచేసి జమచేసిన తరువాత, ఆ నిధులకు సంబంధించి లబ్దిదారులు అయిన సంఘ సభ్యులనుంచి వినియోగ దృవీకరణ పత్రం         తీసుకోవడం ఆనవాయితీ అని, దీంట్లో బాగంగానే పసుపు కుంకుమ పథకమునకు కూడా నిధుల దృవీకరణ పత్రం ఈ కార్యక్రమం ద్వారా  తీసుకోవడం జరుగుతున్నది. దీనిని వక్రీకరించి సాక్షి దిన పత్రికలో ప్రచారం చేయడాన్ని మంత్రి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి  అసత్య ప్రచారాన్ని ప్రజలు ఎవరు  నమ్మరని గ్రహించాలని మంత్రి హితవు పలికారు. 

Related Posts