YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

చంద్రన్న పెళ్లికానుక కు మరో అవకాశం

చంద్రన్న పెళ్లికానుక కు మరో అవకాశం

నిరుపేద కుటుంబాలకు చెందిన వారు వివాహం చేసుకున్న తర్వాత వారికి ఆర్థిక రక్షణతో పాటు భరోసా కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘చంద్రన్న పెళ్లి కానుక ’ ద్వారా మరింత ఎక్కువ మందికి లబ్ధి చేకూర్చేలా ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ‘చంద్రన్న పెళ్లి కానుక ’ పథకం అమల్లోకి వచ్చినా... నమోదు విషయంలో సయమం లేకపోవటంతో కొందరు, అవగాహన లేకపోవటంతో మరికొందరు ఇప్పటి వరకు ప్రయోజనం పొందలేకపోయారు. ఈ నేపథ్యంలో అర్హత కలిగి ఉండి లబ్ధి పొందలేని వారు మరోసారి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం వచ్చింది.

దరఖాస్తుల స్వీకరణ ఇలా...

ఏప్రిల్ 20వ తేదీ నుంచి సెప్టెంబరు 7వ తేదీ మధ్య కాలంలో వివాహం జరిగి, చంద్రన్న పెళ్లికానుకను దరఖాస్తు చేసుకోని వారంతా తిరిగి చేసుకోవచ్చు. 

అర్హులైన వారు ఆధార్, తెల్లరేషన్కార్డు, పెళ్లి కార్డు , మూడు పెళ్లి ఫోటోలు,మీసేవా  ద్వారా పొందిన ఇంటిగ్రేటెడ్  కులధ్రువీకరణ పత్రం, వయస్సు ధ్రువీకరణ పత్రం (పదో తరగతి ధ్రువపత్రం/ఇంటిగ్రేటెడ్ సర్టిఫికెట్), వధువు ఆధార్ తో లింక్ అయిన బ్యాంకు ఖాతా పుస్తకంతో దరఖాస్తు చేసుకోవాలి. 

 సెప్టెంబరు 24వ తేదీ నుంచి అక్టోబరు 24వ తేదీ వరకు దరఖాస్తులు చేసుకునే వెలుసుబాటు కల్పించారు. లబ్ధిదారులు  దరఖాస్తులు వధువు కు సంబంధించిన  పట్టణ మెప్మా కేంద్రంలో/ వెలుగు మండల సమాఖ్య కేంద్రంలో  సమర్పించాలి. 

 దరఖాస్తు సమర్పించిన తర్వాత అధికారులు ఆన్లైన్ చేసే సమయంలో వధువు, వరుడు ఇద్దరూ తప్పనిసరిగా ఉండాలి. వారి వేలిముద్రలను సేకరించిన తర్వాతే... ఆన్లైన్లో దరఖాస్తు సమర్పించే ప్రక్రియ పూర్తవుతోంది.

లబ్ధి చేకూరేదిలా...

 గతంలో ఉండే కులాంతర వివాహ ప్రోత్సాహ పథకాన్ని చంద్రన్న పెళ్లికానుకలో కలిపి దాని ద్వారా వచ్చే లబ్ధిని పెంచారు.   ఎస్టీ, ఎస్సీలకు రూ.50 వేల నుంచి రూ.75 వేల వరకు, బీసీలకు రూ.10 వేల నుంచి రూ.50 వేలకు వరకు నిధులు పెంచారు. దివ్యాంగులకు రూ.50 వేల నుంచి రూ.లక్షకు పెంచారు.  కులాంతర వివాహం కాని వారికి చంద్రన్న పెళ్లికానుకలో భాగంగా ఎస్సీలకు రూ.40 వేలు, ఎస్టీలకు రూ.50 వేలు, బీసీలకు రూ.35 వేలు, ముస్లింలకు (దుల్హన్ పథకంలో భాగంగా) రూ.50 వేలు మంజూరు చేస్తారు.  వివాహ తేదీ నాటికి వధువుకు 18, వరుడికి 21 సంవత్సరాలు నిండి ఉండాలి. ప్రజా సాధికార సర్వేలో వ్యక్తిగత వివరాలు నమోదై ఉండాలి.  మొదటసారి వివాహం చేసుకునే వారు మాత్రమే ఈ పథకానికి అర్హులు. అయితే వధువు వితంతువు అయి ఉండి, వరుడికి మొదటి వివాహం అయితే ఈ పథకానికి అర్హులవుతారు.   వధువు బ్యాంకు ఖాతాను ఆధార్ నెంబరుతో అనుసంధానం చేసుకుని ఉండాలి.  దివ్యాంగుల ధ్రువీకరణకు సదరం సర్టిఫికెట్ ఉండాలి.   ఇతర కులము లకు చెందిన భవన నిర్మాణ కార్మికుల బోర్డు/కార్మిక సంక్షేమv బోర్డు నందు నమోదైన  (వధువు లేక తల్లిదండ్రులు)  వారికి  రూ20,000/-లు .పారితోషకం ఇస్తారు. 

Related Posts