విశాఖపట్టణం జిల్లాలోని అరకు టీడీపీ ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావును, ఆయన ప్రధాన అనుచరుడు, మాజీ ఎమ్మెల్యే శివేరి సోమను మావోయిస్టులు కాల్పి చంపారు. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. డుంబ్రిగూడ మండలంలోని లిప్పిట్టిపుట్టు వద్ద మావోయిస్టులు దాడికి పాల్పడ్డారు. వీరు క్షేత్రస్థాయి పర్యటనలో ఉండగా మావోయిస్టులు ఈ దాడికి పాల్పడ్డారని, మూడు రౌండ్ల కాల్పులు జరిపినట్టు సమాచారం. ఈ ఘటనలో వీళ్లిద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు.