రాజస్థాన్‌లోని ఓ ప్రధాన బ్యాంక్‌కు కన్నమేసి 925 కోట్ల రూపాయలను దోచుకోవాలని పథక రచన చేశారు. అమలు పరిచేందుకు సిద్ధమయ్యారు. ఓ కానిస్టేబుల్ చొరవతో వారి ప్రయత్నం సఫలం కాలేదు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జయపుర ఏసీపీ ప్రఫుల్ల కుమార్ బుధవారం వెల్లడించారు. సోమవారం ఉదయం జయపురలోని ఓ బ్యాంక్ వద్దకు 13 మంది దుండగులు ముసుగులు ధరించి వచ్చారు. సెక్యూరిటీ గార్డుపై దాడి చేసి లోపలికి చొరబడేందుకు యత్నించారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న సీతారామన్ అనే కానిస్టేబుల్ వారిపై కాల్పులు జరిపినట్లు ఏసీపీ తెలిపారు. అప్పటికే మిగతా పోలీసులను అలర్ట్ చేయడంతో దొంగలు పారిపోయారు. సమయస్ఫూర్తితో వ్యవహరించిన సీతారామన్‌పై ప్రశంసల జల్లు కురిసింది. సీసీటీవీ ఫుటేజీ పరిశీలిస్తున్నారు. ఒక వేళ ఈ దొంగతనం జరిగుంటే దేశంలోనే పెద్ద దొంగతనంగా రికార్డు స్రుష్టించేది.