అరకు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కిడారు సర్వేశ్వర రావు, మాజీ ఎమ్మెల్యే సివేరి సోమను మావోయిస్టులు కాల్చి చంపడం పట్ల ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అమెరికా పర్యటనలో ఉన్న ఆయన.. దాడి గురించి తెలియగానే తీవ్ర దిగ్భ్రమకు గురయ్యారు. జరిగిన దారుణం గురించి ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు., అరకు ఏజెన్సీలో మావోయిస్టుల దాడిని ముఖ్యమంత్రి ఖండించారు. వెనుకబడిన ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనుల అభ్యన్నతికి కిడారి, సివేరి చేసిన సేవలను కొనియాడారు