అరకు ఎమ్మెల్యే కిడారి సర్వేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే సోమను మావోయిస్టులు కాల్చి చంపిన ఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో వారి అనుచరులు, బంధువులు, స్థానికులు మండిపడుతున్నారు. అరకు, డుంబ్రిగూడ పోలీస్ స్టేషన్లపై దాడి చేశారు. డుంబ్రిగూడ ఎస్ఐ నిర్లక్ష్యం వల్లే ఈ దాడి జరిగిందని వారు ఆరోపిస్తున్నారు.