సమంత ఇటీవలె కాలంలో 'రంగస్థలం', 'మహానటి', 'యూటర్న్', 'ఇరుంబుదురై' (తెలుగులో అభిమన్యుడు) చిత్రాలు బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లను రాబట్టిన సంగతి తెలిసిందే. తన తరువాతి చిత్రాన్ని భర్త నాగ చైతన్యతో కలసి చేయనున్న సమంత, ఈలోగా చిన్న బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకుని, అనుకున్నదే తడవుగా విహారయాత్రకు వెళ్లిపోయింది. ఆమె తన సోషల్ మీడియా అకౌంట్లో 'ఫైనల్లీ వెకేషన్' అంటూ వ్యాఖ్యానించింది. అక్టోబర్ 6న సమంత, చైతూల వివాహ దినోత్సవం కాగా.. అదే రోజున వీరి కొత్త సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.