ఆసియాక్‌పలో భారత జైత్ర యాత్ర కొనసాగుతోంది. రోహిత్ శర్మ (119 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 111 నాటౌట్), శిఖర్ ధవన్ (100 బంతుల్లో 16 ఫోర్లు, 2 సిక్సర్లతో 114) సూపర్ సెంచరీలతో ఫామ్ చాటుకోవడంతో పాకిస్థాన్‌తో జరిగిన సూపర్-4లో భారత్ 9 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మొదట జస్ప్రీత్ బుమ్రా (2/29), యుజ్వేంద్ర చాహల్ (2/46), కుల్దీప్ యాదవ్ (2/41) కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో పాక్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 237 పరుగులే చేయగలిగింది. షోయబ్ మాలిక్ (78; 90 బంతుల్లో 4×4, 2×6), సర్ఫ్రాజ్ అహ్మద్ (44; 66 బంతుల్లో 2×4) రాణించారు. అనంతరం శిఖర్, రోహిత్ సెంచరీలతో చెలరేగడంతో భారత్ 39.3 ఓవర్లలో ఒక్క వికెట్టే కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.