కృష్ణా జిల్లా మోపిదేవి మండలం లోని 12 వ నెంబరు కాలువ మోపిదేవి నుండి మెయిన్ రోడ్ క్రిందనుంచి కోసురివారిపాలెం మీదుగా చిరువోలులంక వరకు ఉన్న నాలుగు వేల ఎకరాలకు సాగు నీరు అందజేస్తుంది. ప్రధాన కాలువ లెవెల్ తక్కువగా ఉండటం; కోసురివారిపాలెం వైపు లెవల్ ఎక్కువగా ఉండటం వలన ప్రధాన కాలువ లో ఫుల్ లెవెల్ నీరు ఉంటే తప్ప, ఈ కాలవ లోనికి నీరు రావటం లేదు.
పైగా ఈ కాలవ లెవెల్ కంటే సాగు భూమి పై లెవల్ లో ఉండటం వలన, రైతులు బోర్లను వాడి కాలవ నుండి పొలాలకు నీరు పట్టుకుంటున్నారు.
అసలే లెవెల్ ఎక్కువగా ఉండటం వలన నీరు రాక పోవటం, వచ్చిన కొద్దిపాటి నీరు కూడా కొందరి రైతులకు మాత్రమే లభ్యమవడం తో చాలా మంది రైతులు ఇబ్బంది పడుతున్నారు.
లిఫ్ట్ ఇరిగేషన్ పద్ధతి లేదా ఇతర పద్ధతి ద్వారా... సిబ్బందిని పంపించి సమస్యపై పరిశీలన చేయించి నాలుగు వేల ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులకు అందరికి సాయం అందించాలని రైతుల ప్రార్ధన..