చత్తీస్ ఘడ్ లో భారీ మావోయిస్ట్ ఆయుధ డంప్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏడుగురు మావోయిస్టులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు, ప్రజాప్రతినిధులను లక్ష్యం గా చేసుకొని మందు పాత్రలు, పైప్ బాంబ్స్ అమర్చినట్లు అనుమానిస్తున్నారు. దుబ్రిగుడలో ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేల హత్యల ఘటనలు మరువక ముందే చత్తీస్ ఘడ్ లోని నారాయణపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో మావోయిస్ట్ కుట్రను పోలీసులు ఛేదించారు. మావోస్టులు నుండి పెద్దమొత్తం లో ఆయుధ సంపత్తి స్వాధీనం కావడంతో పోలీసులు, ప్రజా ప్రతినిధులు ఊపిరి పీల్చుకున్నారు.