ఏపీ ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిచేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 11 జిల్లాలు పూర్తి చేసుకొని విజయనగరం లోకి ప్రవేశించింది. సోమవారం ఉదయం అయన విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలంలో యాత్ర ప్రారంభించారు. . విశాఖపట్నం జిల్లాలో పాదయాత్రను పూర్తి చేసుకున్న జగన్ విజయనగరం జిల్లా ఎస్.కోట నియోజకవర్గం చింతలపాలెంకు చేరుకోగానే వైఎస్సార్ సీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. జననేత తమ జిల్లాలోకి వస్తున్నారని వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు, మద్దతుదారులు వేలాదిగా తరలి రావడంతో చింతలపాలెం గ్రామం జనసంద్రంతో నిండిపోయింది. "269 రోజులుగా 116 నియోజకవర్గాల్లోని 1650 గ్రామాలు, 7 కార్పొరేషన్లు, 44 మున్సిపాలిటీలో పాదయాత్ర చేస్తూ నేడు 3 వేల కిలోమీటర్లకు చేరుకుంది. జంగలపాలెం మీదుగా విజయనగరం జిల్లా కొత్తవలస మండలం చింతలపాలెంలో ప్రవేశించింది. విజయనగరం జిల్లాలో పాదయాత్ర తడివానిపాలెం, దేశపాత్రునిపాలెం, కొత్తవలస మీదుగా తుమ్మికపాలెం వరకు కొనసాడింది. దేశపాత్రునిపాలెం వద్ద జగన్ పాదయాత్ర 3వేల కిలోమీటర్లు పూర్తి చేసుకోనుంది. ఈ సందర్భంగా దేశపాత్రునిపాలెం వద్ద జగన్ పైలాన్ను ఆవిష్కరించారు.