YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు దేశీయం

రైళ్లలో దోపిడీకి ప్రయత్నిస్తే కాల్చేస్తాం రైల్వేశాఖ వార్నింగ్

రైళ్లలో దోపిడీకి ప్రయత్నిస్తే కాల్చేస్తాం  రైల్వేశాఖ వార్నింగ్
రైళ్లలో ప్రయాణించే వారికి మంచి సౌకర్యాలతో పాటు భద్రత కల్పించేందుకు చర్యలు తీసుకుంటోంది రైల్వే శాఖ. రైళ్లలో దోపిడీల సంఖ్య పెరిగిపోవడంతో  దొంగలపై దృష్టిపెట్టింది. దీనికి సంబంధించి కీలక నిర్ణయం తీసుకుంది. రైళ్లలో దోపిడీకి ప్రయత్నించే దొంగలను కాల్చి వేయాలని డిసైడ్ అయ్యింది. రైల్వే పోలీస్,  రైల్వే రక్షక దళం ) సంయుక్త సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది రైల్వేశాఖ. రైళ్లలో రక్షణగా సాయుధ బలగాలను యుద్ధప్రాతిపదికన ఏర్పాటు చేయనున్నారు అధికారులు. మరోవైపు, తెలంగాణలో రాత్రి వేళల్లో రాకపోకలు సాగించే అన్ని ఎక్స్ప్రెస్, కొత్త ప్యాసింజర్ రైళ్లకు రక్షణగా సాయుధ బలగాలను త్వరలోనే ఏర్పాటు చేయనున్నారు. సిగ్నల్ టాంపరింగ్కు అవకాశమున్న ప్రాంతాల్లో రాత్రి పెట్రోలింగ్కు జీఆర్పీ, ఆర్పీఎఫ్  ఆధ్వర్యంలో సంయుక్త బృందాల ఏర్పాటుకు అధికారులు సిద్ధమయ్యారు. 

Related Posts