YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు వాణిజ్యం

స్టాక్ మార్కెట్లు క్రాష్...

 స్టాక్ మార్కెట్లు క్రాష్...
దేశీయ స్టాక్ మార్కెట్లు మరోసారి కుప్పకూలాయి. గతవారం భారీ నష్టాలను మూటగట్టుకున్న మార్కెట్లు సోమవారం కూడా భారీ నష్టాలతోనే ముగిశాయి. ఉదయం నష్టాలతోనే ఆరంభమైన ట్రేడింగ్‌లో.. సూచీలు ఏ దశలోనూ కోలుకోలేకపోయాయి. కడదాకా నష్టాల బాటలోనే సాగాయి. అమ్మకాల ఒత్తిడి మార్కెట్లను ఓ కుదుపు కుదపడంతో సెన్సెక్స్ ఓ దశలో 550 పాయింట్లు కోల్పోయి 36,216 వద్దకు చేరింది. నిఫ్టీ కూడా 10 వేల స్థాయికి దిగజారింది. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 536.58 పాయింట్ల నష్టంతో 36,305.02 వద్ద, నిఫ్టీ 175 పాయింట్ల నష్టంతో 10,967.40 వద్ద ముగిశాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 38 పాయింట్లు క్షీణించి 72.58 వద్ద కొనసాగుతోంది. ఎన్‌ఎస్‌ఈలో టీసీఎస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, టెక్ మహింద్రా, రిలయన్స్ షేర్లు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు ఐచర్ మోటర్స్, వొడాఫోన్ ఐడియా, మహింద్రా & మహింద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు షేర్లు టాప్ లూజర్లుగా మిగిలాయి. బీఎస్‌ఈలో టీసీఎస్, కోల్ ఇండియా, ఇన్ఫోసిస్, రిలయన్స్, ఎన్టీపీసీ తదితర షేర్లు లాభాల్లో ముగిశాయి. హెచ్‌డీఎఫ్‌సీ, ఇండస్ ఇండ్ బ్యాంకు, , మహింద్రా & మహింద్రా, అదానీ పోర్ట్స్, భారతీ ఎయిర్‌టెల్ తదితర షేర్లు నష్టాల్లో ముగిశాయి. 

Related Posts