సమాచారహక్కు ముఖ్య కమీషనర్ పదవి ఖాళీగా సంవత్సరాల తరబడి ఉంటున్నా..ఆ పోస్టును భర్తీ చేయడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. ఇటీవలే ముగ్గురు సమాచార కమీషనర్లును నియమించాలని ప్రభుత్వం గవర్నర్‌కు సిఫార్సు చేసింది. కానీ గవర్నర్ ఇంత వరకు సంబంధించిన ఫైల్‌పై ఆమోదముద్ర వేయలేదు. సమాచార ముఖ్య కమీషనర్ పోస్టు భర్తీ చేయకుండా కమీషనర్లును భర్తీ చేస్తే..గవర్నర్ ఎలా ఆమోదిస్తారని ఐఎఎస్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ముందుగా ముఖ్య కమీషనర్ పోస్టును భర్తీ చేసి మిగతా కమీషనర్లను నియమిస్తే..గవర్నర్ ఆమోదిస్తారు. తెలంగాణ క్యాడర్‌కు చెందిన ఐఎఫ్‌ఎస్ అధికారి, కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్నారని..ఆయనకు ఈ పోస్టు ఇవ్వాలని ముఖ్యమంత్రి చంద్రబాబునిర్ణయం తీసుకున్నారని ఇంతకు ముందు ప్రచారం జరిగింది. ఇటీవల ప్రభుత్వం కూడా ఆ పోస్టు భర్తీ కోసం నోటిఫికేషన్ ఇచ్చింది. రిటైర్ డిజిపి మాలకొండయ్య, ఆ పోస్టును ఆశిస్తున్న ప్రముఖ లాయర్లు, ఇతర మేధావులు కూడా ఆ పోస్టు కోసం ధరఖాస్తు చేసుకున్నారు. ఈ మధ్యలో ఏం జరిగిందో ఏమో..కానీ..సెప్టెంబర్10వ తేదీ వరకు ఉన్న గడువును అక్టోబర్15వరకు పొడిగించింది. ఇప్పటి వరకు ఆ పోస్టులో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన వారినే నియమించారు. కాంగ్రెస్ హయాంలో ఆ సాంప్రదాయాన్ని పాటించారు. ఏ కారణాలతోనో..చంద్రబాబు ఐఎఫ్‌ఎస్ అధికారిని ఆపోస్టులో నియమించాలని ఆలోచిస్తున్నారు. కారణాలు ఏవైనా..ముఖ్య కమీషనర్‌ను నియమించకుండా ముగ్గురు కమీషనర్లను నియమించడంపై విమర్శలు వస్తున్నాయి. ఆ ముగ్గురు కమీషనర్లును నియమించకుండా గవర్నర్ ఎందుకు తాత్సారం చేస్తున్నారు..దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటో బయటపడడం లేదు. అపార రాజకీయ, అధికార అనుభవం ఉన్న 'చంద్రబాబు' సామాచార ముఖ్యకమీషనర్, కమీషనర్లను నియమించకుండా విమర్శలు కొని తెచ్చుకున్నారు. ఆయన దృష్టిలో ఎవరిని నియమించాలనే దానిపై స్పష్టత లేదని..ఇంతకు ముందు వేరే పేరును ఆయన అనుకున్నారని, కానీ..ఆ పేరు కాదనిమరో పేరు ఆలోచిస్తున్నారని, అందుకే ఈ కమీషనర్ల నియామకం ఆలస్యం అవుతోందని తెలుస్తోంది. ముఖ్య కమీషనర్‌ను నియమిస్తేనే..మిగతా కమీషన్ల లిస్టును గవర్నర్‌ను ఆమోదిస్తారని రాజభవన్ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబర్10వరకు గడువు ఉన్న నేపథ్యంలో ఆ తరువాత ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆర్థిక మంత్రి, ప్రతిపక్షనేత 'జగన్'లు కలసి ముఖ్య కమీషనర్‌ను ఎంపిక చేయాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి ప్రతిపక్షనేత 'జగన్' రానని తేల్చి చెప్పారు. మొదటి సమావేశానికి 'జగన్' రాకపోవడంతో..రెండో సమావేశంలో 'చంద్రబాబు' నిర్ణయం తీసుకుంటారని తెలుస్తోంది.