YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు

గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ 400 ఏళ్లు బతికేస్తదంట..

గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ 400 ఏళ్లు బతికేస్తదంట..

మనిషి జీవిత కాలం ఎంత ? గరిష్టంగా వందేళ్లు.. ఇంకా అంటే మరో నాలుగేళ్లు అటు ఇటుగా ఉండొచ్చు. అదే తాబేలు అయితే రెండొందల ఏళ్ల వరకు బతుకుతుంది. ఇంతకంటే ఎక్కువ రోజులు బతికే జీవరాశి ఏదైనా ఉందా.? ఇటీవలే 400 ఏళ్లు బతికే జీవిని శాస్త్రజ్ఞులు గుర్తించారు. ఆ జీవి ఏంటో తెలుసుకోవాలంటే.. ఈ స్టోరీ చదవాల్సిందే. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ ఆర్కిటిక్‌ మహాసముద్రంలోని అతి శీతల నీటిలో ఈ చేపలు జీవిస్తాయి. ప్రపంచంలో అత్యధిక వయసు ఈ చేపల సొంతం. దాదాపు 400 ఏళ్లుగా ఈ గ్రీన్‌ల్యాండ్‌ షార్క్‌ జీవిస్తోంది. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లు రెండు అడుగుల నుంచి 16 అడుగుల వరకు పెరుగుతాయి. ఇవి అతి శీతల నీటిలో పెరగడం వల్ల వీటి జీవిత కాలం ఎక్కువగా ఉంటుంది. ఈ చేపలు ప్రత్యుత్పత్తి దశకు రావడానికే దాదాపు 150 ఏళ్లు పడుతుంది. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లు 1500 సంవత్సరం నుంచి 1740 వరకు ఎక్కువగా పెరిగాయి. 1620 సంవత్సరం ఈ గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ లకు స్వర్ణయుగం అని చెప్పవచ్చు. ఈ కాలంలో ఇవి అధికంగా పెరిగాయి. గ్రీన్‌ల్యాండ్‌ షార్క్ నాలుగు వందల ఏళ్లు బతికిందనే విషయాన్ని శాస్త్రజ్ఞులు నోవెల్‌ డేటింగ్‌ విధానాల ద్వారా గుర్తించారు. వీటి కంటి కణజాలాల ద్వారా వయసును నిర్దారించారు. భూమి పైన ఉండే జీవుల్లో తాబేళ్లు రెండొందల ఏళ్ల వరకు బతికితే.. ఈ షార్క్ చేపలు మాత్రం 400 ఏళ్ల వరకు జీవిస్తాయి. 400 ఏళ్ల అంటే.. అప్పటి వరకు వాటికి ఎలాంటి హాని జరగకుండా ఉండాలి. పెద్ద చేపల నుంచి తప్పించుకుంటూ ప్రకృతి విపత్తులను ఎదుర్కొంటూ నిలబడాలి.

 

Related Posts