తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి వారిని భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు దర్శించుకున్నారు. మంగళవారం ఉదయం స్వామి వారికి జరిగే నైవేద్య విరామ సమయంలో కుటుంభ సమేతంగా స్వామి వారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు. సామాన్య భక్తునిలా వైకుంఠం క్యూలైన్ లో వచ్చిన ఉపరాష్ట్రపతికి మహాద్వారం వద్ద ఆలయ అధికారులు, అర్చకులు ఇస్థీకపాల్ తో స్వాగతం పలికారు. టిటిడి ఈఓ అనిల్ కుమార్ సింఘాల్, జేఈఓ శ్రీనివాసరాజు అయనకు దగ్గరుండి దర్శనం చేయించారు. రంగనాయకుల మండపంలో వెంకయ్యనాయుడుకి వేదపండితులు వేద ఆశీర్వచనం తీర్థప్రసాదాలు అందజేశారు అర్చకులు. అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ స్వామి వారి దర్శనం చాలా దివ్యంగా చాలా సంతోషంగా ఆనందంగా జరిగిందని ఆయన అన్నారు. స్వామి వారిని సాధారణ పౌరునిగా దర్శించుకోవడమే నాకు ఇష్టం అని వెంకయ్య తెలిపారు. దేశవ్యాప్తంగా నానాటికీ వెంకన్న భక్తులు పెరుగుతున్నారని, వారందరికీ కూడా అవకాశం కల్పించే విధంగా వీఐపీలు తిరుమలకు రావడం కొంత వరకు తగ్గించుకోవాలని విజ్ఞప్తి చేశారు. సామాన్య భక్తులకు దర్శన భాగ్యం కలిగేలా చేయాలని, టీటీడీ అధికారులు ఇదే అంశాన్ని పరిశీలించమని చెప్పానని వెంకయ్యనాయుడు అన్నారు