YUV News Logo
YuvNews
Open in the YuvNews app
OPEN

ఫ్లాష్ న్యూస్

వార్తలు ఆంధ్ర ప్రదేశ్

కాగ్ నివేదికకు సమాధానం ఇవ్వాలి

కాగ్ నివేదికకు సమాధానం ఇవ్వాలి

పోలవరం ప్రాజెక్టు  2019 కి పూర్తి చేయడం సాధ్యకాదని   కాగ్  నివేదిక చెప్పింది. పోలవరం ప్రాజెక్టు లో ప్రధాన కాల్వల టెన్నల్స్ పనులు మొదలు కాలేదు. పోలవరం డ్యాం నిర్మాణపనులు ఇంకా మొదలుకాలేదని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. మంగళవారం నాడు అయన మీడియాతో మాట్లాడారు. పోలవరం 2019కి పూర్తయ్యే అవకాశమే లేదు. స్పిల్ వే నిర్మాణం రిజర్వాయరు పూర్తయితేనే ప్రయోజనం వుంటుంది. రిజర్వాయరు నిండిన తర్వాత దిగువ ధవలేశ్వరం బ్యారేజ్ కు నీరు విడుదల చేయడానికే స్పిల్ వే వుంటుంది. అదే స్పిల్ వే చూపించి పోలవరం పనులు శరవేగమంటూ జనాన్ని తీసుకెళ్ళి చూపిస్తున్నారు. పోలవరం పనుల్లో తప్పులను కాగ్ ఎత్తిచూపింది. నాలుగేళ్ళల్లో కాగ్ నివేదికలుపై కనీసం చర్చ జరగలేదు. కాగ్ నివేదిక ప్రకారం సొంత ఇల్లు అయినా ఇలా కట్టుకోలేం. అగ్రిమెంట్ లో పది శాతం కూడా పనులు కాలేదు.పైగా డబల్ పేమెంట్స్ ఇస్తున్నారని అయన విమర్శించారు. పోలవరం లో థర్డ్ పార్టీ క్వాలిటీ కంట్రోలు లేదు.  థర్డ్ పార్టీ  క్వాలిటీ  కంట్రోలు ఎ ందుకు చేయలేదని కాగ్ ప్రశ్నించింది. చంద్రబాబు ప్రభుత్వం నడుపుతున్నాడా లేదా అనుమానం వస్తోందని వ్యాఖ్యానించారు. డ్యాం లేదు,టన్నల్స్ లేవు, డిస్ట్రిబ్యూట్ కెనాల్స్ లేవు ఎలా 2019 కి పూర్తి చేస్తారు. పోలవరం భేతాళ కథలా అన్పిస్తోంది. ఇంజనీర్లను మీడియా ముందు పోలవరం గురించి చెప్పమనండని అయన నిలదీసారు. ఇదే పోలవరం పై నా ఆఖరు ప్రెస్ మీట్. కాగ్ తప్పులపై ప్రభుత్వఁ సమాధానం చెప్పాలి. కాగ్ పై ఇరిగేషన్ అధికారులైనా సమాధానం చెప్పాలని ఉండవల్లి డిమాండ్ చేసారు.
రాఫిల్ పై  కుంభకోణం పై  వాస్తవాలు వెల్లడించాలి. రాఫిల్ ఎలా పనిచేస్తుందో చెప్పమనలేదు.. రేటు చెప్పమంటే రహస్యం అంటున్నారు. భోఫార్స్ కుంభకోణం ఆరోపణలపై అప్పట్లో భోఫార్స్ గన్ పేల్చిచూపించారు.  ముహూర్తాలు పాలైతే ఇలాగే చనిపోతారని పుష్కరఘటనపై సోమయాజులు కమీషన్ రుజువు చేసింది. సంప్రదాయం తప్పుపడుతూ సోమయాజులు కమీషన్ నివేదిక ఇచ్చింది. నక్సలైట్లు ఎమ్మెల్యే పై  కాల్పులు పై పోలీసులను సస్ప్ండ్ చేశారు. 30 మంది పుష్కర తొక్కిసలాట లో  చనిపోతే హోం గార్డుకు కూడా పనిష్మెంట్ లేదు. సంస్కృతి సంప్రదాయాలు కనపడవా అని ఉండవల్లి ప్రశ్నించారు. అన్నక్యాంటీన్లలలో కూడా అవినీతి రాజ్యమేలుతోంది. వివరాలు త్వరలో వెల్లడిస్తానని అయన వివరించారు. కుటుంబరావు గారికి  అంగీకారమైతే పోలవరం కాగ్, ఆదరణ, అన్నక్యాంటీన్లపై చర్చిద్ధాం రండని అన్నారు. రెండురోజుల్లో అమరావతి వస్తానని వివరించారు.

Related Posts