ఐక్యరాజ్య సమితి వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలుగులో మాట్లాడారు. రెండు నిమిషాల పాటు తెలుగులో మాట్లాడతానంటూ సభకు చెప్పి ప్రసంగం ప్రారంభించారు. చంద్రబాబు మాట్లాడుతూ సదస్సులో పాల్గొనడం నాకు దక్కిన అరుదైన అవకాశంగా భావిస్తున్నా. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ భారతీయుల తరపున మనస్ఫూర్తిగా నమస్కారాలని అన్నారు. ఆంధ్రప్రదేశ్ నేడు ప్రకృతి వ్యవసాయానికి కేంద్రంగా మారింది. ప్రకృతి వ్యవసాయంతోనే ప్రపంచానికి ఆదర్శంగా మారాం. ప్రకృతి వ్యవసాయంపై దృష్టి సారిస్తే ఆరోగ్యవంతమైన ఆహారం పొందవచ్చని అన్నారు. ఐటీ రంగంలో ప్రపంచంలోనే భారత్ ముందంజలో ఉంది. ప్రతి నలుగురు ఐటీ ఉద్యోగుల్లో ఒకరు భారతీయుడే - నలుగురు భారతీయ ఐటీ ఉద్యోగుల్లో ఒకరు ఆంధ్రప్రదేశ్ కు చెందినవారే. గత రెండు దశాబ్దాలుగా సాంకేతికతను పెద్దఎత్తున ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సాంకేతికత-ప్రకృతిని కలిపి ప్రోత్సహించడం ద్వారా అద్భుతాలు సాధించవచ్చు. భారత్ లో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్న మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 60 లక్షల మంది రైతులను కలిగిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. 8 హెక్టార్ల సాగు భూమి..5 కోట్ల జనాభా ఉన్న రాష్ట్రం. 62శాతం జనాభా వ్యవసాయ రంగ పరిశ్రమలపై ఆధారపడి జీవిస్తోంది. భారతదేశపు వ్యవసాయ గిన్నెగా ఆంధ్రప్రదేశ్ కీర్తిగాంచింది. ఆంధ్రప్రదేశ్ 974 చదరపు కి.మీ. విస్తీర్ణంతో దేశంలోనే అతిపెద్ద సముద్రతీర ప్రాంతం కలిగి ఉందని చంద్రబాబు అన్నారు.