టీడీపీ చింతమనేని ప్రభాకర్ పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఏలూరు పర్యటన సందర్బంగా అయన మీడియాతో మాట్లాడారు. టిడిపిని నేను సపోర్ట్ చేసినపుడు శాంతిభద్రతలకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తారనుకున్నా. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని విషయంలో సియం ఉదాసీనంగా వ్యవహరించడం సరికాదని అయన అన్నారు. ఎమ్మెల్యే ప్రభాకర్ రౌడిషీటర్ గానే వ్యవహరిస్తున్నారు. ఆయనపై 27కేసులు ఉన్నా ఎలాంటి చర్యలు లేవని వ్యాఖ్యానించారు. దళిత తేజం అంటూనే ఆ కులాలపై దాడులు చేయిస్తున్నారు. ఎమ్మెల్యే చింతమనేనిని సియం గారు క్రమశిక్షణలో పెడతారా అని ప్రశ్నించారు. లేకపోతే క్షేత్రస్థాయిలో ప్రజలనే నిర్ణయం తీసుకోమంటారా అని అడిగారు. అనుభవం ఉన్న నాయకులని మీకు సపోర్ట్ చేస్తే దోపిడి చేసే నాయకులకు మీరు కొమ్ముకాస్తున్నారు. దోపిడిలు చేస్తున్న ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకుంటారా? లేక ప్రజలనే నిర్ణయించుకోమంటారాని అన్నారు. పవన్ కల్యాణ్ పాస్టర్స్తో భేటీ అయ్యారు. క్రాంతి కల్యాణ మండపంలో జరుగుతున్న సమావేశంలో పవన్ పాస్టర్స్ల సమస్యలు తెలుసుకున్నారు. అంతకుముందు అయన హమాలి కార్మికులతో సమావేశం అయ్యారు.