దేశవ్యాప్తంగా బంగారం ధరలు మంగళవారం భారీగా తగ్గాయి. 10 గ్రాములు 24 క్యారెట్ల బంగారం ధర రూ.440 తగ్గి.. ప్రస్తుతం రూ.32,160 వద్ద కొనసాగుతోంది. ఇక 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర మాత్రం అతిస్వల్పంగా రూ.10 పెరిగి రూ.30,160 వద్ద కొనసాగుతోంది. ఒకవైపు యూఎస్ ఫెడరల్ రిజర్వ్ సమావేశం, మరోవైపు అమెరికా - చైనా మధ్య నెలకొన్న వాణిజ్య యుద్దం నేపథ్యంలో బంగారం ధరలు దిగొచ్చాయి. వెండి ధరలు కూడా పతనమయ్యాయి. క్రితం రోజుతో పోలిస్తే రూ.90 తగ్గిన 100 గ్రాముల వెండి ధర ప్రస్తుతం రూ.4,020 వద్ద కొనసాగుతోంది. దీంతో సోమవారం కిలో వెండి ధర రూ.41,100 పలకగా..మంగళవారం రూ.40,110గా ట్రేడ్ అవుతోంది.